Lady: విదేశాల్లో ఉద్యోగం, బ్రిటీష్ అధికారులు అని చెప్పి ఏం చేశారంటే, ఐటీ హబ్ లో !

ఉన్నత చదువులు చదివిన చాలా మంది యువతి, యువకులు విదేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్న 25 ఏళ్ల యువతిని టార్గెట్ చేసుకున్న కన్నింగ్ ముఠా ఆమె నుంచి లక్షలాది రూపాయలు లాగేశారు.

పుదుచ్చేరి/బెంగళూరు/చెన్నై: విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని చాలా ఆశ ఉంటుంది. ఉన్నత చదువులు చదివిన చాలా మంది యువతి, యువకులు విదేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్న 25 ఏళ్ల యువతిని టార్గెట్ చేసుకున్న కన్నింగ్ ముఠా ఆమె నుంచి లక్షలాది రూపాయలు లాగేశారు. ఉగండాకు చెందిన నిందితులు తమిళనాడు, బెంగళూరులో మకాం వేసి యువతికి నకిలి అపాయింట్ మెంట్ లెటర్ మెయిల్ లో పంపించి చివరికి ఆమెకు సినిమా చూపించారు. పోలీసుల ఎంట్రీతో విదేశీయులకు చుక్కలుకనపడ్డాయి.

 విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ?

విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ?

పుదుచ్చేరిలోని అరియంగుప్పం ప్రాంతంలో నివాసం ఉంటున్నన యువతి విదేశాల్లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంది. డిసెంబరు 2వ తేదీన ఆ యువతికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను భారత్‌లోని బ్రిటీష్ ఎంబసీలె సీనియర్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీ కోసం కెనడాలో మంచి ఉద్యోగం సిద్ధంగా ఉంది, మీరు కెనడా వెళ్లడానికి సిద్దంగా ఉండాలని చెప్పాడు.

 విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నామని ?

విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నామని ?

కొన్ని రోజుల తరువాత ఇద్దరు వ్యక్తులు అదే యువతికి ఫోన్ చేసి ఆమెకు మాయమాటలు చెప్పి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ ఆమెకు మెయిల్ చేశారు. ఉద్యోగం సెక్యూరిటీ కోసం, వీసా కోసం డిపాజిట్ చెల్లించాలని ఆమెను నమ్మించి అప్పటి నుంచి పుదుచ్చేరి యువతికి మాయమాటలు చెప్పి వివిధ బ్యాంకు ఖాతాలకు పలు వాయిదాల్లో రూ. 36 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఎన్ని రోజులకు కాల్ లెటర్ రాకపోవడంతో కెనడా కంపెనీ నుంచి వచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ గురించి ఆరా తీస్తే అది నలికి అని తెలుసుకున్న యువతి హడలిపోయింది.

 నైజీరియా కేటుగాడు

నైజీరియా కేటుగాడు

దీంతో ఆ యువతి పుదుచ్చేరి సీపీసీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నైజీరియాకు చెందిన రూబెన్ నైమిక్ అనే నినందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో యువతికి బెంగళూరు నుంచి ఈ-మెయిల్ పంపినట్లు తేలింది. అనంతరం ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌బాబు సహా పోలీసులు బెంగళూరు వెళ్లారు.

 బెంగళూరులో మకాం

బెంగళూరులో మకాం

బెంగళూరులో తలదాచుకున్న ఉగాండాకు చెందిన నమెల్ ప్రోసీ(29)ని అరెస్ట్ చేసి అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అతడికి సహకరించిన బెంగళూరుకు చెందిన రాజేష్ (32)ని కూడా పుదుచ్చేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరు వ్యక్తుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసిన ఇద్దరినీ పుదుచ్చేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+