వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:అక్రమ లావాదేవీలు జరిపితే 7 ఏళ్ళ జైలు శిక్ష, అక్రమార్కులకు సహకరిస్తే శిక్షే

అక్రమ లావాదేవీలు జరిపిన ఖాతాదారులకు శిక్షలు తప్పవని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది. భారీ జరిమానాతో పాటు ఏడేళ్ళపాటు జైలు శిక్షలు విధించనుంది ఆదాయపుపన్ను శాఖ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:అక్రమ లావాదేవీలు జరిపిన ఖాతాదారులకు శిక్షలు తప్పవని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. భారీ జరిమానాతో పాటు ఏడుళ్లపాటు జైలు శిక్షలు విధించే అవకాశం లేకపోలేదని ఆదాయపు పన్నుశాఖ మరోసారి హెచ్చరికలు చేసింది.

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించే క్రమంలో భాగంగా కేంద్రం అనేక చర్యలను తీసుకొంటుంది. అయితే కేంద్రం తీసుకొన్న చర్యల కారణంగా పన్నులు చెల్లించకుండా అక్రమ మార్గంలో లావాదేవీలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకొంటామని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది.

పెద్ద నగదునోట్ల రద్దు అంశం కూడ నల్లధనాన్ని నిర్మూలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం తీసుకొచ్చింది.అయితే అక్రమార్కులు వక్రమార్గాలను ఉపయోగించి నల్లధనాన్ని మార్పిడి చేసుకొనే ప్రయత్నాలను చేశారు.

అయితే ఈ మార్గాలన్నింటిపై ఆదాయపు పన్నుశాఖ కన్నేసింది. ఈ తరుణంలో అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. చట్టాలను ఉల్లంఘించినవారికి భారీ జరిమానా జైలు శిక్షలు తప్పవని ఆదాయపు పన్నుశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

బినామీ చట్టాన్ని ఉల్లంఘిస్తే 7 ఏళ్ళ జైలు శిక్ష

బినామీ చట్టాన్ని ఉల్లంఘిస్తే 7 ఏళ్ళ జైలు శిక్ష

బినామీ చట్టాన్ని ఉల్లంఢిస్తే ఏడేళ్ళ జైలు శిక్ష విధించనున్నట్టు ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. బినామీ ఆస్తి లావాదేవీల చట్టం 1998 ప్రకారంగా అటుటవింటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. నల్లధనాన్ని కలిగి ఉండడం కూడ అమానవీయమైన నేరమని ఆదాయపుపన్నుశాఖ ప్రకటించింది.నల్ల ధనం నిర్మూలనకు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ఆదాయపు పన్నుశాఖ ప్రజలను కోరింది.

అక్రమ డిపాజిట్లపై కేసులు

అక్రమ డిపాజిట్లపై కేసులు

పెద్ద నగదు నోట్లను గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.అయితే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలపై ఆదాయపు పన్నుశాఖ దృష్టిని కేంద్రీకరించింది. అక్రమ డిపాజిట్లపై ఏడేళ్ళ పాటు జైలు శిక్షతో ాపటు ,బినామీ ప్రాపర్టీపై మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం జరిమానాను విధించనున్నట్టు ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది.

అక్రమాలకు సహకరించినవారికి కూడ శిక్ష

అక్రమాలకు సహకరించినవారికి కూడ శిక్ష

బినామీఆస్తులకు సహకరించినవారికి కూడ శిక్ష విధించనున్నట్టుగా ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. లబ్దిదారుడితో పాటు సహకరించినవారికి శిక్షలు తప్పవు. 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారంగా ఆయా ఆస్తులను ఎటాచ్ చేయడం లేదా ప్రభుత్వానికి ఆస్తులను స్వాధీనం చేయడం లాంటి అదనపు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది ఆదాయపు పన్నుశాఖ.

తప్పుడు సమాచామిచ్చినా ఏడేళ్ళ జైలు శిక్ష

తప్పుడు సమాచామిచ్చినా ఏడేళ్ళ జైలు శిక్ష

ఖాతాదారులు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినా కాని ఏడేళ్ళ జైలు శిక్షను విధించిననున్నట్టు ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది.బినామీ ఆస్తి మార్కెట్ విలువపై 5 శాతం జరిమానాను విధించనున్నట్టు ఐటి శాఖ హెచ్చరించింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదాయపు పన్నుశాఖ ఖాతాదారులను కోరింది.

బినామీ చట్టం కింద 235 కేసులు నమోదు

బినామీ చట్టం కింద 235 కేసులు నమోదు

ఈ ఏడాది ఫిబ్రవరి మద్య కాలం వరకు 235 కేసులు నమోదయ్యాయని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. రూ.200 కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబదించి 140 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఐటి శాఖ ప్రకటించింది. 124 కేసుల్లో రూ.55 కోట్లకు పైగా బినామీ ఆస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేసినట్టు ఐటిశాఖ ప్రకటించింది. వీటిల్లో బ్యాంకు ఖతాల డిపాజిట్లు వ్యవసాయ , ఇతర భూమి, ప్లాలు , అభరణాలు ఉన్నాయని ప్రకటించింది ఆదాయపు పన్నుశాఖ.

English summary
The income tax departmetn today warned that those who undertake benami transcations woule invite rigorous imprrsoment (RI) of up 7 years and such violators would aslo stand to be charged the normal IT act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X