వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ పోలింగ్ హింసాత్మకం... బూత్‌లోకి చొచ్చుకెళ్లిన అల్లరి మూకలు... కాల్పుల్లో నలుగురి మృతి...

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న నాలుగో విడత పోలింగ్‌‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూచ్ బెహార్‌ జిల్లాలోని రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందారు.మృతుల్లో మొదటిసారి ఓటు హక్కు పొందిన యువకుడు ఉండటం గమనార్హం. గుర్తు తెలియని దుండగులు గుంపుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి కాల్పులు జరపడంతో... అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ఎదురుదాడి చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

ఓటర్లను అడ్డుకున్న మూక...

ఓటర్లను అడ్డుకున్న మూక...


సీఐఎస్ఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం... శనివారం(ఏప్రిల్ 10) ఉదయం 9.35గంటల ప్రాంతంలో కూచ్‌ బెహార్‌లోని మాతాబంగ పోలింగ్ బూత్ 126 వద్దకు 50 నుంచి 60 మంది దుండగులు గుంపుగా వచ్చారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ బలగాలు ఆ దుండగలను అడ్డుకోగా... వారి పైనే దాడికి పాల్పడ్డారు. దీంతో భద్రతా బలగాలు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపి ఆ మూకను చెదరగొట్టారు.

నలుగురి మృతి...

నలుగురి మృతి...


ఆ తర్వాత కొద్దిసేపటికే పోలింగ్ బూత్ 186 వద్దకు దాదాపు 150 మంది ఒక గుంపుగా వచ్చారు. అక్రమంగా లోపలికి చొరబడి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక ఆశా వర్కర్,హోంగార్డు గాయపడ్డారు. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ఆ మూక ప్రయత్నించింది. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఆ మూకలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

టీఎంసీ,బీజేపీ పరస్పర ఆరోపణలు...

టీఎంసీ,బీజేపీ పరస్పర ఆరోపణలు...

నిజానికి భద్రతా బలగాలు మొదట రెండు రౌండ్లు గాల్లోకే కాల్పులు జరిపాయని... అయినప్పటికీ ఆ మూక దాడి ఆపకపోవడంతో ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చిందని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఏడు రౌండ్ల కాలపుల్లో నలుగురు చనిపోయినట్లు తెలిపింది. ఈ హింసాత్మక ఘటనలపై టీఎంసీ,బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను భద్రతా బలగాల పైకి రెచ్చగొడుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌కి పాల్పడేందుకే ఇలా భద్రతా బలగాలపై మోదీ తన గూండాలతో దాడి చేయిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఇదంతా కేంద్రమంత్రి అమిత్ షా పనే అని... ఆయన డైరెక్షన్‌లోనే కేంద్ర బలగాలకు ఈ చర్యలకు పాల్పడుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు.

English summary
At least four people, including a first-time voter, were killed across two separate incidents in Cooch Behar, West Bengal.Sources say three people died after central forces open-fired in a polling booth in “self-defence”; while in another place one person died after miscreants opened fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X