టాప్ హీరోయిన్ హఠాన్మరణం - సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే..!!
కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి ఐంద్రిలా శర్మ కన్నుమూశారు. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. ఇటీవలే తెలుగు చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర విషాదంలో ముంచిన సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 24 సంవత్సరాల వయస్సులోనే ఐంద్రిలా శర్మ కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె మరణం పట్ల బెంగాలీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
తొలుత బెంగాలీ టీవీ సీరియళ్లలో నటించారు. అనంతరం జీబన్ జ్యోతి, జీబన్ కథి వంటి కొన్ని సినిమాల్లో నటించారు. నిజానికి ఐంద్రిలా శర్మ క్యాన్సర్ సర్వైవర్. రెండుసార్లు ఆమె క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. ఆ తరువాత సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కొన్ని వెబ్‌సీరీస్‌లల్లో నటించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటోన్న దశలో ఐంద్రిలా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. హౌరాలోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 1వ తేదీన అడ్మిట్ అయ్యారు.

ఇంట్రాక్రానియల్ హ్యామరేజ్‌కు ఐంద్రిలా గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనితో డాక్టర్లు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందించారు. అప్పటికీ కోలుకోలేదు. పరిస్థితి మరింత విషమించడంతో శనివారం వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందించారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ మధ్యాహ్నం ఐంద్రిలా శర్మ కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఐంద్రిలాకు ఇంకా వివాహం కాలేదు. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌధరి ఉన్నారు. ఐంద్రిలా ఆరోగ్య పరిస్థితి విషమించిన సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉంటోన్నారు. ఆమె ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు. మరింత విషమించిందని, ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలంటూ విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఆయన దీనికి సంబంధించిన పోస్టులు పెట్టారు. ఆయన ఈ పోస్టులు పెట్టిన కొన్ని గంటల్లోనే ఐంద్రిలా తుదిశ్వాస విడిచారు.












Click it and Unblock the Notifications