ఆటో డ్రైవర్ దాష్టీకం: లేడీ టెక్కీని రోడ్డుపై 100 మీ. ఈడ్చేశాడు
బెంగళూరు: కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరిన ఓ మహిళా టెక్కీకి మంగళవారం సాయంత్రం పీడకలే అయింది. 14 ఏళ్ల మహిళా టెక్కీకి ఆటో డ్రైవర్ నుంచి దారుణమైన సంఘటన ఎదురైంది.
తమిళనాడుకు చెందిన రంజిత తన సహోద్యోగితో వాటర్ ట్యాంక్ సమీపంలోని కోరమంగళ మూడో బ్లాక్ వద్దకు వచ్చింది. సిగ్నల్ వద్ద వేచి చూస్తున్న సమయంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ తనవైపు అదోగా చూస్తుండడాన్ని ఆమె గమనించింది. దాంతో ఆమె అతనితో గొడవకు దిగింది.
ప్రతిగా అతను ఆమెను దుర్భాషలాడాడు. అతని వాహనాన్ని పట్టుకుని ఆటో డ్రైవర్‌ను నిలువరించడానికి రంజిత ప్రయత్నించింది. అయితే, అతను ఆటోను ఆపకుండా ముందుకు నడపించాడు. దాంతో ఆటో ఆమెను రోడ్డుపై దాదాపు వంద మీటర్లు ఈడ్చుకెళ్లింది.

ఎలక్ట్రానిక్ సిటీలోని తన కార్యాలయం నుంచి రంజిత తన సహోద్యోగి ఆసిష్‌తో కలిసి కోరమంగళలోని ఒకటో బ్లాక్‌లోని తన ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ మధుసూదన్ ఆమెవైపు పక్కచూపులు చూడడం ప్రారంభించాడు. దాంతో గొడవ ప్రారంభమైంది.
తనను ఈడ్చుకెళ్తున్న దృశ్యాన్ని చూసి రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డం పడడంతో డ్రైవర్ ఆటోను ఆపాడుని ఆమె చెప్పింది. కోరమంగళ పోలీసు స్టేషన్‌లో ఆమె ఈ సంఘటనపై ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications