Bengaluru: ఓలా, ఉబర్, రాపిడోకు పగిలింది, ఐటీ హబ్ లో ఆటో, క్యాబ్ మాయ, సీరియస్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో కోటి మంది జనభా ఉంటే లక్షకు పైగా ఆటోలు, మరో లక్ష క్యాబ్ లు ఉన్నాయి. ఫ్యాషన్ కు పోయి పాటుపడుతున్న యువత ఐటీ హబ్ లో చిన్నపాటుపడటం లేదని ఇప్పటికే అనేకసార్లు వెలుగు చూసింది. బెంగళూరులో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించాలంటే ఎక్కువగా ఓలా, ఉబర్, రాపిడో క్యాబ్ లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అయితే క్యాబ్, ఆటో అగ్రిగేటర్లు ప్రయాణికుల దగ్గర ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ దెబ్బతో క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్, రాపిడో ఆటో సర్వీసులు నిలిపివేయాలని కర్ణాటక రవాణా శాఖ అధికారులు సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేశారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆటోలు లక్షకు తక్కువ లేవు మిత్రమా
ఐటీ హబ్ బెంగళూరులో కోటి మంది జనభా ఉంటే లక్షకు పైగా ఆటోలు, మరో లక్ష క్యాబ్ లు ఉన్నాయి. బెంగళూరులో లక్షల మంది ఆటోలు, క్యాబ్ లు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. చాలా మంది ఓలా, ఉబర్, రాపిడో సంస్థలతో లింక్ పెట్టుకుని ఆటోలు, క్యాబ్ లు నడుపుతున్నారు.

రవాణా శాఖ పెట్టిన ధరలు ఎంతంటే ?
బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఆటో డ్రైవర్లు రెండు కిలోమీటర్ల వరకు మినిమమ్ చార్జ్ రూ. 30 వసూలు చెయ్యాల్సి ఉంది. ఈ నియమ నిబంధనలు కర్ణాటక ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఓలా, ఉబర్, రాపిడో యాప్ లు ఉన్న ఆటో డ్రైవర్లు భారీ మొత్తంలో డబ్బులు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారని చాలా మంది ప్రయాణికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

చట్టపరంగా చర్యలు
ఓలా, ఉబర్, రాపిడో సంస్థలతో లింక్ పెట్టుకున్న క్యాబ్, ఆటో అగ్రిగేటర్లు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు ఫిర్యాదులు వచ్చాయని, చట్ట వ్యతిరేకంగా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారి కుమార్ చెప్పారని ది మింట్ పత్రిక కథనం ప్రచురించింది.

దెబ్బకు దెయ్యం దిగిపోతుంది
బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఓలా, ఉబర్, రాపిడో సేవలను నిలిపివేయాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ నౌ కథనం ప్రచురించింది. మొత్తం మీద ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న కొందరు ఆటో డ్రైవర్లకు బ్రేక్ వెయ్యాలని కర్ణాటక రవాణా శాఖ అధికారులు రంగం సిద్దం చెయ్యడం మంచిదే అని బెంగళూరు ప్రజలు అంటున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications