బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బావిలో గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు మొబైల్ కోసం గాలింపు: కేసులో కీలక సాక్షం, రహస్యాలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ లను ఎలాగైనా ముప్పుతిప్పలు పెట్టాలని బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బావిలో మునిగిపోయిన ఓ మెబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవాలని సీసీబీ పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

సాక్షాలు నాశనం ?

సాక్షాలు నాశనం ?

ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో సాక్షాలు నాశనం చెయ్యడానికి నిందితులు ప్రయత్నించారని సీసీబీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆంబిడెంట్ చీటింగ్ కేసు కుంభకోణం చాల పెద్దదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఈ కేసు బాదితులు రోడ్డునపడ్డారని, వారికి ఎలాగైనా న్యాయం చేస్తామని పోలీసులు అంటున్నారు.

మొబైల్ లో రహస్యలు

మొబైల్ లో రహస్యలు

ఆంబిడెంట్ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు ఆలీఖాన్ ఉపయోగించిన మొబైల్ ఫోన్ దర్యాప్తులో కీలకంగా మారిందని పోలీసులు అంటున్నారు. ఆలీఖాన్ మొబైల్ చేతికి చిక్కితో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీసీబీ పోలీసులు అంటున్నారు.

బావిలో మొబైల్

బావిలో మొబైల్

గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు ఆలీఖాన్ ను అరెస్టు చెయ్యడానికి సీసీబీ పోలీసులు వెళ్లారు. ఆ సందర్బంలో విషయం పసిగట్టిన ఆలీఖాన్ తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ సీసీబీ పోలీసుల చేతికి చిక్కకూడదని భావించాడు. వెంటనే పక్కనే ఉన్న అతని స్నేహితుడు జయరాంకు మొబైల్ ఫోన్ ఇచ్చి సమీపంలోని బావిలో వెయ్యాలని సూచించాడని పోలీసులు అంటున్నారు.

సీసీబీ పోలీసుల తంటాలు

సీసీబీ పోలీసుల తంటాలు

ఆలీఖాన్ చెప్పినట్లు జయరాం బావిలో మొబైల్ ఫోన్ పడేశాడు. బావిలో పడిన మొబైల్ ఫోన్ లో ఆంబిడెంట్ నిర్వహకులు, ఆలీఖాన్ మాట్లాడుకున్న పూర్తి సమాచారం ఉందని, ఆ మొబైల్ చితికి చిక్కితే మరన్ని సాక్షాలు సేకరించడానికి అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

బావిలో సోదాలు

బావిలో సోదాలు

బావిలో పడిపోయిన ఆలీఖాన్ మొబైల్ ఫోన్ ఇప్పటి దాకా పోలీసుల చేతికి చిక్కలేదు. బావిలో నీరు ఎక్కువగా ఉండటం. మొబైల్ ఫోన్ అడుగులో పడిపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆలీఖాన్ ఉపయోగించిన మొబైల్ నెంబర్ సిమ్ కార్డు వివరాలు సేకరించాలని సీసీబీ పోలీులు నిర్ణయించారు.

English summary
Central Crime Bureau police have searching for Ali Khan's cell phone which was thrown in the well during police raid in Ambident company fraud case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X