వీళ్లు తల్లిదండ్రులేనా?: కొడుకుని బైక్ ఫుట్‌రెస్ట్‌పై నిల్చొబెట్టి.. (వీడియో)
బెంగళూరు: తల్లిదండ్రులంటే తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఆపదా రానీయరు. కానీ, ఇక్కడ మాత్రం ఓ జంట తమ కుమారుడి ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయాణం చేసింది. చిన్నారిని బైక్ ఫుట్ రెస్ట్ పై నిలబెట్టి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.
ఆ బైక్ వెనుక నుంచి వస్తున్న ఒకరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పిల్లాడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆ జంటపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికిపైగా వీక్షించారు. ఆ దంపతుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

'ఈ సంఘటన చూస్తుంటే మాటలు రావడం లేదు. ఇలా ఎవరైనా చేయగలరా?' అని ఓ నెటిజన్ స్పందించారు. చిన్నారిని ప్రమాదంలో పడేలా వ్యవహరించిన వీరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రయాణాలు వారితోపాటు ఇతరులకు కూడా ప్రమాదమేనని మండిపడుతున్నారు.
Idiots on the road 🤬@blrcitytraffic @BlrCityPolice please take action. pic.twitter.com/tAN9BxTHiS
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) April 15, 2024
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలు: మహిళకు రూ. 1.36 జరిమానా
బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో ఆమెకు భారీ జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆమెకు రూ. 1.36 లక్షలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications