వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిని ఎరవేసి భర్తను హత్య చేయించింది, ఎందుకు?

ఓ అమ్మాయిని ఎరవేసి మరీ తన భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది ఓ భార్య. అంతేకాదు ఈ హత్య చేసినందుకుగాను కిరాయి హంతక ముఠాకు రూ.30 లక్షలు ఇవ్వడమే కాకుండా గతంలో ఇచ్చిన అప్పు రూ.5 లక్లలను కూడ మాఫీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఓ అమ్మాయిని ఎరవేసి మరీ తన భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది ఓ భార్య. అంతేకాదు ఈ హత్య చేసినందుకుగాను కిరాయి హంతక ముఠాకు రూ.30 లక్షలు ఇవ్వడమే కాకుండా గతంలో ఇచ్చిన అప్పు రూ.5 లక్లలను కూడ మాఫీ చేయనున్నట్టు ఆమె ప్రకటించింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

దీంతో భార్య కోరిక మేరకు భర్తను హత్య చేశారు కిరాయి మూఠా సభ్యులు. ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.అయితే ఈ హత్యకు మృతుడి భార్యే ప్రధాన సూత్రదారి అని తేలడంతో పోలీసులు నిర్థాంత పోయారు.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఆరు రోజుల క్రితం కుమార్ అనే ఫైనాన్షియర్ హత్యకు గురయ్యాడు.ఆయన హత్యకు భార్య డోరెన్ కుట్ర పన్నిందని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.

ఈ మేరకు ఆమె శ్రీధర్ అనే వ్యక్తిని తన భర్తను హత్య చేసేందుకు ఒప్పించింది.శ్రీధర్ కుమార్ వద్ద రూ.5 లక్షలను అప్పుగా తీసుకొన్నాడు.అయితే ఈ అప్పును కూడ వదిలేస్తానని డోరెన్ శ్రీధర్ కు హామీ ఇచ్చింది.

Bengaluru financier's wife outsourced his murder to debtor; killers roped in

కుమార్ చాలా మందికి మహిళలకు అప్పులు ఇచ్చేవాడు.అయితే అప్పులు తీర్చకపోవడంతో వారితో ఆయన లైంగికవాంఛలు తీర్చుకొనేవాడు.

ఈ విషయాన్ని గుర్తంచిన భార్య డోరెన్ భర్తపై కక్ష పెంచుకొంది. ఆయనను హత్య చేయాలని భావించింది. ఈ మేరకు శ్రీధర్ తో మాట్లాడింది. ఈ పథకానికి శ్రీధర్ కూడ అంగీకరించారు.

శ్రీధర్ ప్రభు అనే వ్యక్తితో ఈ హత్య విషయాన్ని మాట్లాడారు.ప్రభు పాట్రిక్, అవినాష్, దినేష్ లను ఈ ముఠాలో చేర్చుకొన్నారు.

ఈ గ్యాంగ్ కుమార్ ను హత్య చేసేందుకు ఓ అమ్మాయిని ఎరగా వేయాలని భావించారు. ఈ మేరకు ఈ నెల 6వ, తేదిన క్లారా అనే యువతి సహకారం తీసుకోవాలని భావించారు. అయితే ఆమెకు కన్నడ రాదు.దీంతో ఆమె స్నేహితురాలు రేవతి సహకారాన్ని తీసుకొన్నారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి లక్ష్మి పేరుతో ఓ సిమ్ కార్డును కొనుగోలు చేశారు. ఈ సిమ్ ద్వారా రేవతి కుమార్ కు ఫోన్ చేసింది. ఆమె కుమార్ ను కాల్ పల్లీ సెంటీనరి వద్దకు రమ్మని కోరింది. అతను అక్కడికి రాగానే కుమార్ ను దినేష్ , ప్యాట్రిక్, అవినాష్ చంపేశారు.

అయితే ఈ ఘటనలో దినేష్ ప్యాట్రిక్ లను అరెస్టు చేయడంతో డోరెన్ వ్యవహరం వెలుగుచూసిందని పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన వినోద్ అనే కానిస్టేబుల్ కు పోలీసులు రివార్డును ప్రకటించారు.

English summary
Six days after G Kumar, 54, was hacked to death near the Kalpalli Christian Cemetery, east Bengaluru, cops arrested his wife Doreen and four others who were part of the murder plot. Doreen, 48, had outsourced the killing to a debtor, who, in turn, paid killers to finish the job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X