ఐటీ హబ్ లో ఉగ్రవాది అనుచరుడు, నాలుగేళ్లుగా ఎక్కడ ఉన్నాడంటే ?, మార్నింగ్ !
బెంగళూరు: అతను పేరుమోసిన రౌడీ షీటర్. ఉగ్రవాది జునైద్ సహచరుడిగా అనుమానిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 క్రిమినల్ కేసులు ఇతడిపై ఉన్నాయి. నాలుగేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న క్రిమినల్ పోలీసులకు చిక్కుడు. ఇంతకాలం పోలీసులతో దాగుడుమూతలు ఆడిన క్రిమినల్ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు తెల్లవారుజామున పోలీసులు ఆపరేషన్ ఉత్కంఠ రేపింది.
కొద్ది రోజుల క్రితం బెంగళూరు సీసీబీ పోలీసులు ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. విచారణలో నిందితుల వద్ద గ్రెనేడ్ కూడా లభించింది. గ్రెనేడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్లు ఎవరు అని ఆరా తీసిన పోలీసులకు నిందితులు ఉగ్రవాది జునైద్ అనుచరులు అని తెలిసింది. ప్రస్తుతం జునైద్ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు.

2017లో ఉగ్రవాదితో పాటు ఉన్న సహచరుడిని ఇప్పుడు అరెస్టు చేశారు. మహ్మద్ హర్షద్ ఖాన్ అనే నిందితుడినే బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ పోలీస్ స్టేషన్‌లోని రౌడీ షీటర్ అయిన మహ్మద్ హర్షద్ ఖాన్ పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం సహా మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
దుబాయ్‌కు పారిపోయిన అనుమానిత ఉగ్రవాది జునైద్‌కు అహ్మద్ హర్షద్ ఖాన్ సహచరుడు. 2017లో నూర్ అహ్మద్ కిడ్నాప్ మరియు హత్య కేసులో జునైద్‌తో సహా 21 మంది నిందితులలో ఇతను ఒకడు అని పోలీసు అధికారులు అంటున్నారు. జైలుకు వెళ్లి వచ్చిన తరువాత అహ్మద్ హర్షద్ ఖాన్ పెద్ద నేరస్థుడిగా ఎదిగి దందాలు మొదలుపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు.

తరువాత కేసులు ఎక్కువ కావడంతో నాలుగు ఏళ్ల క్రితం అహ్మద్ మాయం అయ్యాడు. వివిధ స్టేషన్ల పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ రాత్రి ఆర్‌టీ నగర్ పూల మార్కెట్ సమీపంలో హర్షద్ ఉన్నట్టు ఆర్‌టీ నగర్ పోలీసులకు సమాచారం అందింది. 27వ తేదీ వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో పోలీసులు స్క్వాడ్‌గా ఏర్పడి అహ్మద్ ను పట్టుకోవడానికి ప్లాన్ చేశారు.
ఆ ప్రాంతంలోని పలు సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇంట్లో అహ్మద్ ఉన్నాడా ? లేదా అని పరిశీలించారు. అహ్మద్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. మహ్మద్ హర్షద్ తనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేయడమే కాకుండా బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రెండో అంతస్తు నుంచి దూకేందుకు కూడా అహ్మద్ సిద్ధం అయ్యాడు. అప్పుడే పోలీసులు చాకచక్యంగా అహ్మద్ ను పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు అహ్మద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల అతన్ని విచారిస్తున్నారు. ఉగ్రవాది జునైద్‌తో పాటు ఓ కేసులో నిందితుడిగా ఉన్నందున అహ్మద్ కు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి లింక్ ఉన్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి క్ల్యూ లభించలేదని పోలీసులు అంటున్నారు..
క్రిమినల్ అహ్మద్ ఇంకా ఉగ్రవాది జునైద్‌తో టచ్‌లో ఉన్నాడా?, ఇతను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడా అని సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసులకు కూడా నిందితుడు అహ్మద్ గురించిన సమాచారం అందడంతో పాటు విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాతే అహ్మద్ చరిత్ర మొత్తం తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications