కావేరి రగడ: బెంగళూరు అల్లర్ల క్రిమినల్స్ వీరే (ఫోటోలు)
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన సమయంలో చేతివాటం చూపించి లూటీలు చేసిన క్రిమినల్స్ ఇప్పుడు ఇళ్లకు తాళం వేసి పరారైనారు.
లూటీలు చేస్తున్న క్రిమినల్స్ వివరాలు, వారు చేసిన లూటీలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. బెంగళూరు అల్లర్లకు కారణం అయిన అందరినీ అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

ప్రత్యేక దర్యాప్తు
బెంగళూరు నగరంలో కావేరీ వివాదం కారణంగా మైసూరు రోడ్డు నుంచి నాయండనహళ్ళి వరకు జరగిన అల్లర్లపై క్షుణ్ణంగా దర్యాప్తు చెయ్యాలని నగర పోలీసు కమిషనర్ మేఘరిక్ సీసీబీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

700 వీడియో క్లిప్పింగ్స్
స్యాటిలైట్ బస్ స్టాండ్, టింబర్ యార్డ్, మునేశ్వర బ్లాక్, హెగ్గనహళ్ళిలో జరిగిన గొడవలకు సంబంధించి 700కు పైగా వీడియో క్లిప్పంగ్స్, సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

550 మంది అరెస్టు
బెంగళూరు నగరంలో అల్లర్లకు కారణం అయ్యారని ఇప్పటి వరకు పోలీసులు 550 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

218 మంది క్రిమినల్స్ అరెస్టు
మైసూరు రోడ్డులో జరిగిన అల్లర్లకు కారణం అయ్యారని 218 మంది క్రిమినల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారిని గుర్తించామని వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

చేతిలో కత్తులు, వేటకోడవళ్లు, మారణాయుధాలు
కన్నడ పోరాట సంఘాల ముసుగులో పలువురు క్రిమినల్స్ చేతిలో మారణాయుధాలు పెట్టుకుని సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాచ్ లు బ్యాచ్ లుగా
లూటీలు చెయ్యాలని ముందుగా ప్లాన్ వేసుకున్న క్రమినల్స్ మొదట ఓ బ్యాచ్ గేట్లు ధ్వంసం చేశారు. ఇంకో బ్యాచ్ లోపలికి చోరబడి చేతికి చిక్కిన వస్తువులు లూటీ చేసిన విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దుకాణాల్లోకి వెళ్లిన నిందితులు ఎంత ఇస్తావో చెప్పు లేదంటే అంగడి కాల్చేస్తామని బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

రూ. రెండు లక్షలు తీసుకున్నారు
ఓ షాప్ యజమానిని బెదిరించి రూ. రెండు లక్షలు లూటీ చేశారని పోలీసులు గుర్తించారు. సీసీబీ అధికారుల చేతికి చిక్కిన క్లిప్పింగ్స్ లో క్రిమినల్స్ అరాచకాలు అన్నీ ఉన్నాయి.

పాతనేరస్తులు
గొడవలు చేసిన వారిలో పిక్ ప్యాకెట్లు చేసేవారు, గంజాయి తాగేవారు, పాతనేరస్తులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

వినాయకుడి చందా పేరుతో
వినాయక చవితి పండుగ సందర్బంగా తాము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి టింబర్ యార్డులోని ఎవీ. మసాల ఫుడ్స్ ప్రై. లిమిటెడ్ లో 200 మంది చోరబడి లూటీ చేశారని అధికారులు ఆధారాలు సేకరించారు. పలు దుకాణాల్లో క్యాష్ కౌంటర్లలో చేతులు పెట్టి నగదు, మొబైల్స్ లూటీ చేశారని అధికారులు గుర్తించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications