30శాతం కమిషన్ కు ఒప్పందం!: ఆర్బీఐ సీనియర్ అధికారి బాగోతం ఇదే
30 శాతం కమిషన్ కు పాతనోట్లను మార్చేందుకు ఆర్బీఐ సీనియర్ అధికారి మైకెల్ నల్లకుబేరులతో బేరం కుదుర్చుకుంటున్నట్టుగా అధికారులు తేల్చారు.
బెంగుళూరు: కమిషన్ తీసుకుని కోటిన్నర పాత నోట్లకు కొత్త కరెన్సీని ముట్టజెప్పిన బెంగుళూరు ఆర్బీఐ అధికారి మైకెల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మైకెల్ తో పాటు మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.17 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులో ఉన్న ముగ్గురి నుంచి అసలు విషయం రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా 30 శాతం కమిషన్ కు పాతనోట్లను మార్చేందుకు ఆర్బీఐ సీనియర్ అధికారి మైకెల్ బేరం కుదుర్చుకుంటున్నట్టుగా అధికారులు తేల్చారు. నల్లడబ్బును మార్చుకునేందుకు తాను సహాయం అందిస్తానని, అయితే అందులో 30శాతం కమిషన్ తనకు ముట్టజెప్పాల్సిందిగా మైకెల్ ఆఫర్ ఇచ్చాడని అధికారుల విచారణలో వెల్లడయినట్టుగా తెలుస్తోంది.

సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నవారిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు క్యాషియర్ పరాశివమూర్తి కూడా ఉన్నారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన 12 కేసుల్లో పరాశివమూర్తిపై ఆరోపణలున్నాయి. మైకెల్, పరాశివమూర్తి ఇద్దరు కలిసి కోటిన్నర రూపాయల పాతనోట్లను తీసుకొని కొత్త నోట్లతో మారుస్తామని ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా సమాచారం.
కాగా, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను ఇచ్చేందుకు గాను రిజర్వు బ్యాంకు అధికారులు మైకెల్ ను కొల్లేగల్‌లోని కరెన్సీ చెస్ట్‌కు వెళ్లాలని సూచించారు. ఇదే అదునుగా భావించిన మైకెల్ పరాశివమూర్తితో పాటు మరికొంతమందితో చేతులు కలిపాడు. 30శాతం కమిషన్ కు మొత్తం 13మంది నల్లకుబేరుల డబ్బును కొత్త నోట్లలోకి మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications