బెంగళూరు ఆర్ఆర్ నగర్ ఎన్నికల కౌంటింగ్, నాయుడు దెబ్బకు బీజేపీ విలవిల, ఎంత తేడా!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్ )లో శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రముఖ సినీ నిర్మాత, సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులైన బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులను వెనక్కినెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న ప్రతి రౌండ్ లోను మెజారిటీతో దూసుకుపోవడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ నగర్ లో నాయుడు దెబ్బకు బీజేపీ విలవిలలాడుతోంది.

మొదటి రౌండ్
ఆర్ఆర్ నగర్ శాసస సభ నియోజక వర్గంలో ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయకుడుకు 9,342 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడకు 5,220 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్పకు 1,540 ఓట్లు, కన్నడ హీరో, స్వతంత్ర పార్టీ అభ్యర్థి హుచ్చా వెంకట్ (పిచ్చి వెంకట్)కు 76 ఓట్లు వచ్చాయి.

నాయుడు దూకుడు
ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు మెజారిటీ ఓట్లతో దూసుకపోతున్నారు. ఆర్ఆర్ నగర్ ఎన్నికల కౌంటింగ్ నాలుగవ రౌండ్ లో మునిరత్న నాయుడుకు 33,520 ఓట్లు, బీజేపీ మునిరాజు గౌడకు 14,807 ఓట్లు, జేడీఎస్ రామచంద్రకు 14,807, కన్నడ హీరో హుచ్చా వెంకట్ కు 145 ఓట్లు, 633 నోటా ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్ కైవసం !
బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ కైవసం అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల అధికారులు 11 గంటలకు 8వ రౌండ్ ఫలితాలు ప్రకటించే సమాయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడుకు 75,282 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడకు 31,182 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్పకు 19,509 ఓట్లు, 900కు పైగా నోటా ఓట్లు వచ్చాయి.

డీకే బద్రర్స్ ఎఫెక్ట్
బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడుకు మద్దతుగా డీకే శివకుమార్, డీకే సురేష్ ప్రచారం చేశారు. నిత్యం మీకు అందుబాటులో ఉంటున్న మునిరత్న నాయుడును గెలిపించాలని డీకే బ్రదర్స్ స్థానికులకు మనవి చేశారు.

ఎన్నికల కమిషన్ దెబ్బ
ఆర్ఆర్ నగర్ లోని జాలహళ్ళిలోని అపార్ట్ మెంట్ లో 9 వేలకు పైగా ఓటరు ఐడీ కార్డులు బయటపడటంతో మే 12వ తేదీ జరగవలసిన ఎన్నికలు వాయిదాపడి మే 28వ తేదీ జరిగాయి. ఆర్ఆర్ నగర్ లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురైనారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications