సెక్స్ స్కాండల్ కేసులో ఎంపీకి నో బెయిల్, సిట్ కస్టడీకి ప్రజ్వల్, ఈ స్టోరీ మొత్తం చెప్పకండి !
లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో అరెస్టు అయిన ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిగింది. బెంగుళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, మే 31వ తేదీ అర్ధరాత్రి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసింది.
బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల సిట్ కస్టడీకి ఇస్తూ ఆదేశించింది. సిట్ కస్టడీ ఇస్తే న్యాయవాదిని సందర్శించేందుకు అనుమతించాలి. అంతేకాకుండా ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని ప్రజ్వల్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను కలవడానికి న్యాయవాదిని 9.30 నుంచి 11.30 వరకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది.

వైద్య పరీక్షలకు సహకరించాలని ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు సూచించింది. నిందితుడు ప్రజ్వల్‌ను విచారణ పేరుతో వేధించరాదని కోర్టు పేర్కొంది.
దీనికి ముందు ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో ప్రజ్వల్ జడ్జి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాదనలకు ముందు సిట్ రెండు నివేదికలను సమర్పించింది. కస్టడీ కోసం సిట్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎస్పీపీ అశోక్ నాయక్ కస్టడీ కోసం వాదించారు. ప్రజ్వల్‌పై అత్యాచారం ఆరోపణలు వచ్చాయని, హాసన్ జిల్లాలోని హలేనరసీపురలో కేసు నమోదు అయ్యిందని కోర్టుకు చెప్పారు. బాధితురాలు ఇంటి పనిమనిషి అయినప్పటికీ అతను చాలా ప్రమాదకరమైనవాడని, జాగ్రత్తగా ఉండాలని మహిళను చాలాసార్లు హెచ్చరించాడని,.అలాంటి పనులు చేయడం అతని హాబీ అని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారని తెలిసింది.
ప్రజ్వల్ రేవణ్ణ రెండోసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయన బాధితులు వంద మందికి పైగా ఉన్నారని సిట్ ఆరోపించింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం అది అత్యాచారం, ప్రజ్వల్ స్వంతంగా వీడియోను రికార్డ్ చేశాడని, వాట్సాప్ కాల్ చేసి బట్టలు విప్పమని అడిగాడని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు. ఆ సందర్బంలో న్యాయమూర్తి మీరు ఇక్కడ పూర్తి కథను చెప్పవద్దని, కస్టడీకి గల కారణాన్ని మాత్రమే చెప్పండి అని అన్నారని తెలిసింది.
ఆ తర్వాత ప్రజ్వల్ రేవణ్ణను పూర్తిగా విచారించాల్సి ఉందని, చాలా మంది బాధితులు ముందుకు రావడం లేదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, చాలా మంది మహిళలు అతని బాధితులుగా ఉన్నారని, అశ్లీల వీడియో వైరల్ కావడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారని, ప్రజ్వల్ ను విచారించాలని, అతను వీడియో తీసిన మొబైల్ ఫోన్‌ను గుర్తించాల్సి ఉందని, దీంతో పాటు పలువురు సాక్షులను సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు.
ప్రజ్వల్ డ్రైవర్ మొబైల్ మాత్రమే రికవరీ చేయబడిందని, ప్రజ్వల్ మొబైల్‌లో పేస్ లాక్ ఉందని, వీటన్నింటిపై విచారణ జరగాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు వివరించారని తెలిసింది. ప్రజ్వల్ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దేశం విడిచిపెట్టాడని, తిరిగి రావడం అతని ఉద్దేశం కాదని, అతను విదేశాలకు ఎందుకు వెళ్లాడో ఇంతవరకు చెప్పలేదని, 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఎస్పీపీ అభ్యర్థించారు. అయితే వాదనలు విన్న కోర్టు ఆరు రోజులు ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీకి ఇవ్వడానికి అంగీకరించింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications