భర్తపై లాక్‌డౌన్ ఫిర్యాదు: ‘నెలరోజులుగా స్నానం లేదు, శృంగారం చేయమంటున్నాడు’

బెంగళూరు: కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇళ్లల్లోనే అంతా ఉండటంతో చాలా మంది సంతోషంగా గడుపుతుండగా, మరికొన్ని ఇళ్లల్లో మాత్రం గృహహింస పెరిగిపోతుండటం గమనార్హం. దీంతో గృహహింస కేసులు కూడా పెరిగిపోతున్నాయి. మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతువుతున్నాయి.

పోలీసులకు షాక్..

పోలీసులకు షాక్..

తాజాగా, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గత నెల రోజులుగా స్నానం మానేసిన భర్త శృంగారం చేయాలంటూ హింసిస్తున్నాడంటూ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

స్నానం చేయలేనంత బద్ధకం..

స్నానం చేయలేనంత బద్ధకం..

బెంగళూరుకు చెందిన ఓ కిరాణా షాపు యజమాని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ దుకాణాన్ని తెరవడం లేదు. ఇంటికే పరిమితమైన అతడు అతిబద్ధకంగా తయారయ్యాడు. అది కూడా స్నానం చేయలేనంతగా. లాక్ డౌన్ విధించిన మార్చి 24 నుంచి అతను స్నానం చేయకపోవడం గమనార్హం.

శృంగారంలో పాల్గొనాలంటూ..

శృంగారంలో పాల్గొనాలంటూ..

ఇప్పటి వరకు అతడు స్నానం చేయకపోగా, పరిశుభ్రత కూడా పాటించడం లేదు. స్నానం చేయమని, శుభ్రంగా ఉండమని అతడికి రోజూ చెబుతున్నా.. కట్టుకున్న భార్య మాట వినడం లేదు. అంతేగాక, తనతో శృంగారంలో పాల్గొనాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

విసిగిపోయిన భార్య..

విసిగిపోయిన భార్య..

ఈ క్రమంలో అతని వేధింపులతో విసిగిపోయిన ఆ మహిళ ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త కారణంగా తన కూతురు కూడా స్నానం చేయడం లేదని వాపోయింది. దీంతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. ఇక మరో భర్త తనకు బిర్యానీ చేసి పెట్టడం లేదంటూ ఇంటి నుంచి తరిమేశాడు. దీంతో అతడినికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదవుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+