Bharat Bandh : అగ్నిపథ్ పై భారత్ బంద్ -పలు రాష్ట్రాల్లో ఆందోళనలు- రైల్వేస్టేషన్లకు భద్రత
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి నిరసనగా ప్రజాసంఘాల పిలుపుమేరకు ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం రైల్వేస్టేషన్ల వద్ద అదనపు భద్రత కల్పిస్తోంది.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇవాళ ప్రజాసంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్లో పాలుపంచుంటున్న నేపథ్యంలో ఇవాళ భారత్ బంద్ లోనూ పాల్గొంటున్నాయి. భారత్ బంద్ కు పలు రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి. ముఖ్యంగా అగ్నిపథ్ ను ప్యతిరేకిస్తున్న బీహార్, జార్ఖండ్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. జార్ఖండ్ లో అయితే స్కూళ్లకు సెలవులిచ్చి మరీ అధికార జేఎంఎం బంద్ కు సహకరిస్తోంది.

అగ్నిపథ్ పై వెనక్కి తగ్గరాదని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో భారీ స్ధాయిలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రవాణా, రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు భారత్ బంద్ లో యువత పాల్గొనకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బంద్ నిరసనల్లో పాల్గొంటే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలు రైల్వేస్టేషన్లలో హింస చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్రం స్టేషన్ల భద్రతకు అదనపు బలగాల్ని పంపుతోంది.












Click it and Unblock the Notifications