వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covaxin Child Vaccine : కోవాగ్జిన్ చిన్నారుల టీకాకు అనుమతి-2-18 ఏళ్ల మధ్య వయస్కులకు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్న వేళ కేంద్రం ఇవాళ మరో వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. అయితే తొలిసారిగా పిల్లల కోసం రూపొందించిన వ్యాక్సిన్ కు ఈ అనుమతి లభించింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ రూపొందించిన ఈ చిన్నారుల వ్యాక్సిన్ ను కరోనాపై పనిచేస్తున్న నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.

కోవాగ్జిన్ చిన్నారుల టీకా అత్యవసర పరిస్దితుల్లో వాడకానికి కోవిడ్ నిపుణుల కమిటీ అనుమతి మంజూరు చేసింది. రెండేళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు ఈ టీకాను వాడేందుకు అనుమతి లభించింది. భారత్ బయోటెక్ 18 ఏళ్ల లోపు వయస్సున్న చిన్నారులపై రెండు, మూడు దశల ప్రయోగాలను సెప్టెంబర్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత అనుమతి కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ ప్రయోగాల ఫలితాలను పరిశీలించిన కేంద్రం.. అత్యవసర వాడకం కోసం అనుమతి మంజూరు చేసింది.

Bharat Biotechs Covaxin gets emergency approval for kids aged 2-18 years

వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇప్పటివరకూ కోవాగ్జిన్ ను అత్యవసర వాడకం కోసం అనుమతి మంజూరు చేయలేదు. కానీ భారత్ లో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ప్రయోగాలు చేపట్టడం, వాటి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం, ఇవాళ నిపుణుల కమిటీ దానికి ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పిల్లలకు కూడా కరోనా సోకుతున్న నేపథ్యంలో అత్యవసర వాడకానికి మొదటి టీకాను అనుమతి ఇవ్వాలన్న ఒత్తిడి కేంద్రంపై పెరుగుతోంది. దీంతో నిపుణుల కమిటీ కోవాగ్జిన్ చిన్నారుల టీకాకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Bharat Biotech's Covaxin vaccine for children aged 2-18 years gets approval for emergency use by the subject expert committee on covid 19 today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X