అబ్బే అద్వానీజీని అనలేదు: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: బీజేపీ పార్టీ అగ్రనేత, కురవృద్దుడు ఎల్ కే అద్వానీని తానెప్పుడు అగౌరవపరచలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని మీద తాను క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరలేదని స్పష్టం చేశారు.
పార్టీ నాయకత్వం పార్టీ సీనియర్ నాయకులతో చర్చిస్తుందని నితిన్ గడ్కరీ తెలివిగా తప్పించుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కోక్కరూ వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద విరుచుకుపడ్డారు.

ఈ సందర్బంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలకు బాసటగా నిలిచిన నితిన్ గడ్కరీ పార్టీలో ఉన్న వారు ఎవరైనా బాధ్యతారహితంగా మాట్లాడితే చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టకూడదని బహిరంగంగా చెప్పారు.
బీహార్ ఓటమికి పార్టీలోని ప్రతి ఒక్కరు కారణం అని అన్నారు. పార్టీ ఓడిపోతే ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తారని అయితే పార్టీ గెలిచినప్పుడు మాత్రం ఎలా గెలిచాం అని ఎవ్వరూ విశ్లేషణ చెయ్యరని నితిన్ గడ్కరీ ఆరోపించారు.
ఎల్ కే అద్వానీని టార్గెట్ చేసుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విమర్శలు చేశారని సొంత పార్టీలోని కొందరు నాయకులు అన్నారు. ఈ సందర్బంలో తాను ఎల్ కే అద్వానీని ఉద్దేశించి ఈ విమర్శలు చెయ్యలేదని నితిన్ గడ్కరీ తాజాగా శుక్రవారం వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications