ప్రతిష్ఠాత్మక ‘భారత్‌మాల’ ప్రాజెక్టులో ఏపీకి 4, తెలంగాణకు 3 ఎకనమిక్‌ కారిడార్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : జాతీయ రహదారుల, మౌలిక వసతుల అబివృద్ధికి భారత్‌ ఒక​ సాక్షిలా మారనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నిర్మిస్తున్న ఆరు జాతీయ రహదారులే కాకుండా.. భారత్‌మాల ప్రాజెక్టు కింద మరో 44 ఎకనమిక్‌ కారిడార్ల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు.

మొత్తం 7 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రహదారులను నిర్మిస్తోందని, భారతదేశ మౌలిక వసతుల కల్పనలో ఇదొక సువర్ణ అధ్యాయమని ఆయన చెప్పారు.

BharatMala: Total 44 Economic Corridars.. 3 for AP, 2 for Telangana

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు వాటా దక్కింది.. ఆంధ్రప్రదేశ్ కు 4 ఎకనామిక్ కారిడార్లు దక్కగా, తెలంగాణకు 3 కారిడార్లను కేంద్రం ప్రకటించింది. భారత్‌ మాల ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది డిసెంబర్‌లో మొదలవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ సూచనప్రాయంగా తెలిపారు.

దేశంలో హైవేల అభివృద్ధికి 7 లక్షల కోట్లు, ప్రతిష్ఠాత్మకంగా 'భారత్ మాల', మోడీ సర్కారు నిర్ణయం

భారత్‌ మాల ప్రాజెక్టు కింద మొత్తం 44 ఎకనమిక్‌ కారిడార్లు, 65 ఇంటర్‌ కారిడార్లు, 115 ఫీడర్‌ కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తారు. ఇదే విషయాన్ని గడ్కిరీ తన ట్విటర్‌ ఖాతాలోనూ ప్రకటించారు.

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా.. భారత్‌మాల ప్రాజెక్టుకు మంగళవారం​కేంద్రం ప్రభుత్వం ఆమెద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 83,677 కిలోమీటర్ల రహదారిని రూ.7 లక్షల కోట్లతో కేంద్రం అభివృద్ధి చేస్తోంది.

ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. భారత్‌మాల ప్రాజెక్టు వల్ల కోటి ఉద్యోగల సృష్టి జరుగుతుందని మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. భారత్‌ రహదారులు అమెరికా, జర్మనీల స్థాయికి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ, తెలంగాణ ఎకనామిక్ కారిడార్లు ఇవే...

పూణే-విజయవాడ, రాయ్ పూర్-విశాఖపట్నం, చెన్నై-కర్నూలు, బెంగళూరు-నెల్లూరు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ కు దక్కగా.. తెలంగాణకు నార్కట్ పల్లి-పొందుగుల, హైదరాబాద్-పనాజీ, ఆర్మూర్-జగిత్యాల-రామగుండం ఎకనామిక్ కారిడార్లు లభించాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India will witness the development of 44 new corridors, apart from the existing six, under the ambitious Rs 7-lakh crore umbrella highway programme. The corridors are likely to be rolled out by December 2018. Apart from 44 new corridors, 65 inter-corridor and feeder roads and besides 115 feeder roads are coming up. "We will roll out most of the Rs 7 lakh crore projects announced by the government yesterday, before December 2018. The programme is the biggest infrastructure programme, including Bharatmala, that will see India having 50 corridors including the existing six," said Union Minister Nitin Gadkari said on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి