Udaipur Palace: కొత్త మహారాజుకి ఘోర పరాభవం.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి నో ఎంట్రీ
No palace entry to king: మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారీతీసింది. ఇందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. గతంలో కన్నుమూసిన రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసుల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంతలా అంటే నూతనంగా ప్రమాణం చేసిన మహారాజునే ప్యాలెస్‌లోకి అనుమతించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని మేవాడ్ సంస్థానంలో కొత్త మహారాజు పట్టాభిషేకంతో ఈ మొత్తం వివాదం ప్రారంభమైంది. గత మహారాజు మహేంద్ర సింగ్ మేవాడ్ మరణానంతరం ఆయన కుమారుడు, BJP MLA విశ్వరాజ్ సింగ్ మేవాడ్ ఆ స్థానంలో పట్టాభిషిక్తులయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఏకలింగనాథ్ ఆలయం, సిటీ ప్యాలెస్‌ను ఆయన సందర్శించాల్సి ఉంది. అయితే దీన్ని అరవింద్ సింగ్ మేవాడ్ వ్యతిరేకించారు. మహారాజు సహా ఆయన మద్దతుదారులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు.

ప్యాలెస్ లోపలికి అనుమతించకపోవడంతో విశ్వరాజ్ సింగ్ తన మద్దతుదారులతో బలవంతంగా లోనికి ప్రవేశించడం ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య ఈ విషయంలో తోపులాట జరిగి, రాళ్లదాడికి దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ పోస్వాల్ తెలిపారు.
వివాదాస్పద ధుని మాత ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్యాలెస్ తో పాటు సొసైటీ ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. కొన్ని అంశాలపై ఏకీభవించగా, మరికొన్నింటిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రెండు గ్రూపుల్లో ఎవరైనా కేసు పెట్టాలనుకుంటే కచ్చితంగా నమోదు చేసి, పరిశీలిస్తామన్నారు.
మేవాడ్ రాజ కుటుంబానికి చెందిన కొత్త తరాల మధ్య యాజమాన్య హక్కులకు సంబంధించి ఎప్పటినుంచో వివాదం కొనసాగుతోంది. ఆస్తుల నిర్వహణను 9 ట్రస్టులు చూస్తున్నాయి. సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి మహారాణా భగవత్ సింగ్ 'మహారాణా మేవాడ్ ఛారిటబుల్ ఫౌండేషన్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఛారిటబుల్ ట్రస్టుకు అరవింద్ సింగ్ మేవాడ్ చైర్మన్. ఇది ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్ మ్యూజియం నిర్వహణ బాధ్యతలు చూసూకుంటుంది. అందుకే ప్యాలెస్‌లోకి మహారాజు ప్రవేశాన్ని అడ్డుకోగలిగారు.












Click it and Unblock the Notifications