Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. ముడా స్కాంలో లోకాయుక్త క్లీన్ చిట్

MUDA Scam: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్థల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి, ఆయన భార్య, మరో ఇద్దరికి ఆధారాలు లేవని పేర్కొంటూ లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. దర్యాప్తులో ఎటువంటి నేరపూరిత చర్య జరగలేదని తేలింది. దర్యాప్తులో ఆరోపణలు సివిల్ స్వభావం గలవని.. క్రిమినల్ చర్యలు అవసరం లేదని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై వచ్చిన అభియోగాలకు తగ్గ సాక్ష్యాలు లేని కారణంగా నేరు రుజువు చేయలేకపోయినట్లు.. తుది నివేదికను కర్ణాటక హైకోర్టుకు సమర్పించినట్లు విచారణలో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. ఈ కేసులో వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేని కారణంగా నేరం రుజువు కాకపోవడంతో తుది నివేదికను కోర్టుకు సమర్ఫిస్తున్నట్లు లోకాయుక్త పోలీసులు ముడా కేసులో ఫిర్యాదుదారు అయిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు లేఖలో వెల్లడించారు.

ముడా స్థల కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులు అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం, కర్ణాటక భూ కబ్జా చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, లోకాయుక్త దర్యాప్తులో ఎటువంటి క్రిమినల్ తప్పు జరగలేదని తేలింది. అందువల్ల నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తుది నివేదిక సమర్పించబడింది. క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ 2016, 2024 మధ్య ముడా చేసిన పరిహార భూకేటాయింపులను ఇప్పటికీ దర్యాప్తు చేస్తామని లోకాయుక్త తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. తదుపరి దర్యాప్తు అనంతరం సీఆర్పీసీ సెక్షన్ 173(8) కింద మరొక నివేదిక కోర్టుకు సమర్పించబడుతుంది.

Big Relief for Siddaramaiah in MUDA Scam Case Lokayukta Finds No Evidence Against Him

అసలు ఏంటి విషయం?

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని సంక్షిప్తంగా ముడా(MUDA) అని పిలుస్తారు. ఇది మైసూరు నగర అభివృద్ధి పనులకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. భూమి సేకరణస, కేటాయింపు పని ఈ సంస్థ బాధ్యత. మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ 1992లో రైతుల నుంచి కొంత భూమిని సేకరించి దానిని నివాస ప్రాంతంగా అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా దానిని వ్యవసాయ భూమి నుంచి వేరు చేశారు. కానీ 1998లో స్వాధీనం చేసుకున్న భూమిలో కొంత భాగాన్ని ముడా రైతులకు తిరిగి ఇచ్చింది. ఈ విధంగా ఆ భూమి మరోసారి వ్యవసాయ భూమిగా మారింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వివాదం 2004లో ప్రారంభమైంది. సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్‌లోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆమెకు సోదరుడు మల్లికార్జున్‌ బహుమతిగా ఇచ్చారు.

కానీ అదే సమయానికి ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు ముడా స్వాధీనం చేసుకుది. పరిహారం కింద 2021లో సిద్ధరామయ్య భార్య పార్వతికి దక్షిణ మైసూర్ లో కీలకమైన విజయనగర్ లో 38, 238 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని సంపన్న ప్రాంతంలో 14 స్థలాల కేటాయింపు చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్తలు లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. మరో కార్యకర్త స్నేహమయ కృష్ణ కూడా ఈ భూ కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన భార్య, ముడా, పరిపాలనా అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు.

సిద్ధరామయ్య ఇంతకు ముందు ఏమని చెప్పుకున్నారంటే?
తన భార్య పరిహారం పొందిన భూమిని తన సోదరుడు మల్లికార్జున 1998లో బహుమతిగా ఇచ్చాడని సిద్ధరామయ్య పేర్కొన్నారు. కానీ కార్యకర్త కృష్ణ 2004 లో మల్లికార్జున దానిని అక్రమంగా సంపాదించారని, ప్రభుత్వ, రెవెన్యూ అధికారుల సహాయంతో నకిలీ పత్రాలను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిని 1998లో కొనుగోలు చేసినట్లు చూపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+