మళ్లీ గవర్నర్‌తో నితీష్ భేటీ.. గంటలోనే
Nitish Kumar: బిహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. ఊహించినట్టే- అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాళ్ (యునైటెడ్) నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించారు. పాట్నా రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

నితీష్ కుమార్ రాజీనామా అనంతరం అక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ ఉదయం జేడీయూ శాసనసభా పక్ష సమావేశం కొనసాగుతున్న సమయంలోనే అటు భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు.
జేడీయూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏకవాక్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సామ్రాట్ చౌదరి. దీని మీదా ఏకాభిప్రాయం కుదిరింది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా దీనికి తమ ఆమోదం తెలిపారు. బల్లలు చరిచి తమ అంగీకారాన్ని తెలియజేశారు. దీనితో బిహార్‌లో జేడీయూ- బీజేపీ- హిందుస్తాన్ ఆవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది.

ఈ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన లేఖపై బీజేపీ సభ్యులందరూ సంతకాలు చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలో జేడీయూ- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ అంగీకారం తెలిపారు. ఈ లేఖను బీజేపీ ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే.. జేడీయూకు అందజేశారు.
దీనితో ఈ లేఖను తీసుకుని గవర్నర్‌ను కలిశారు. ఆయన వెంట వినోద్ తావ్డే, దినేష్ కుమార్ సింగ్, సామ్రాట్ చౌదరి, హిందుస్తానీ ఆవామీ లీగ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications