Bihar: ABP-C VOTER EXIT POLL: ‘తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..
పాట్నా: బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలో గెలుపు కోసం శ్రమించాయి. ఎన్డీఏ కూటమి, మహాకూటమి(మహాగఠబంధన్) మధ్యే కీలక పోటీ నెలకొంది.
ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ మహాగఠబంధన్ కూటమికే మొగ్గు చూపాయి. దాదాసు పోటీ పోటీ అన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎల్జేపీకి అంతంతమాత్రమే సీట్లు వచ్చాయి.

ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోలింగ్
నితీష్ కుమార్(బీజేపీ-జేడీయూ+) - 104-128
తేజశ్వి యాదవ్ )ఆర్జేడీ-కాంగ్రెస్+) - 108- 131
ఎల్జేపీ(చిరాగ్ పాశ్వాన్) - 1-3
ఇతరులు: 4-8
243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో 122 మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు రావాలి.
ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, మహాఘఠబంధన్ సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ మధ్యే కీలక పోటీ ఉంది. ఈ రెండు పార్టీలకు అధికారం చేపట్టే అవకాశం ఉందని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. అయితే, తేజశ్వి యాదవ్ కూటమికే అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది.












Click it and Unblock the Notifications