వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar elections.. బీజేపీ కంచుకోట రామ్ నగర్ లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రామ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో మహా కూటమి అభ్యర్థి విజయం సాధించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి జోరుగానే ప్రచారం చేస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన రామ్ నగర్ నియోజకవర్గంలో చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 7న జరగనున్న ఎన్నికలకు ఈ నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ జరుగుతోంది .

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్

 2000 సంవత్సరం నుండి బీజేపీ కి కంచుకోట రామ్ నగర్ నియోజకవర్గం

2000 సంవత్సరం నుండి బీజేపీ కి కంచుకోట రామ్ నగర్ నియోజకవర్గం

2000 సంవత్సరం నుండి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని మహా కూటమి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న రామ్ నగర్ , వాల్మీకి నగర్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. రామ్ నగర్ మాత్రమే కాకుండా వాల్మీకి నగర్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అయిన వాల్మీకి నగర్, నార్కటియాగంజ్, బగాహా మరియు లౌరియా లలో కూడా నవంబర్ 7 న తుది విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది.

రామ్ నగర్ లో హోరాహోరీ పోరు

రామ్ నగర్ లో హోరాహోరీ పోరు

2015 ఎన్నికలలో, ఈ ఐదు నియోజకవర్గాలలో మూడింటిలో బిజెపి విజయం సాధించింది.2020 లో రామ్‌నగర్ తరఫున బిజెపికి చెందిన భగీరథి దేవి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ రామ్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన లోకేష్ రామ్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈనియోజకవర్గంలో ఓటర్లు 2,95,612 కాగా ఇందులో 1,55,817 మంది పురుషులు, దాదాపు 140,000 మంది మహిళలు .ట్రాన్స్ జెండర్ కు చెందిన తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు.

 2015 లో బీజేపీ విజయం .. కాంగ్రెస్ ఓటమి

2015 లో బీజేపీ విజయం .. కాంగ్రెస్ ఓటమి

2011 జనాభా లెక్కల ప్రకారం, నియోజకవర్గంలో మొత్తం 4,57,271 జనాభా ఉంది, అందులో 89.41% గ్రామీణ ప్రాంతానికి చెందిగా మిగిలిన 10.59% పట్టణ విభాగానికి చెందినవారు.2015 లో బిజెపి యొక్క భగీరథి దేవి కాంగ్రెస్ అభ్యర్థి పూర్ణమాసి రామ్‌ను రామ్‌నగర్‌లో దాదాపు 18,000 ఓట్ల తేడాతో ఓడించారు. భాగీరథి దేవి 82,166 ఓట్లను , 48.05 శాతం ఓటు బ్యాంక్ ను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పూర్ణమాసి రామ్ 64,178 ఓట్లు, 37.53 శాతం ఓట్లు సాధించారు.

2000సంవత్సరం నుండి కాంగ్రెస్ ఓటమి .. ఈసారైనా ..

2000సంవత్సరం నుండి కాంగ్రెస్ ఓటమి .. ఈసారైనా ..

ఇక 2010 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ రామ్ బిజెపి యొక్క భగీరధీ దేవి చేతిలో 29,789 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2000సంవత్సరం నుండి ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా దాఖలాలు లేవు . ఇప్పుడు జెడియు సంకీర్ణం తో బిజెపి ఈ ఏడాది రామ్‌నగర్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం చేస్తోంది. చివరి దశ పోలింగ్ 78 నియోజకవర్గాలలో జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న నియోజక వర్గం మాత్రం రామ్ నగర్ అని చెప్పక తప్పదు.

English summary
The Ramnagar constituency which is reserved for Scheduled Castes (SCs) will go to the polls on November 7 in the third and last phase of Bihar Assembly Election 2020. The constituency has been a stronghold of the Bharatiya Janata Party (BJP) since 2000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X