వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు హిందుత్వంపై దాడి ... శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్

|
Google Oneindia TeluguNews

బీహార్ ఎన్నికల సమయంలో ముంగేర్ కాల్పుల సంఘటన ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది . ముంగేర్ కాల్పుల ఘటన హిందుత్వంపై దాడి అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు బీహార్ గవర్నర్ దీని గురించి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదని ఆయన అడిగారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చి సీఎం నితీష్ కుమార్ ను, డిప్యూటీ సీఎం సుశీల్ మోడీని సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తే శివసేన దీనిని హిండుత్వంపై దాడిగా పేర్కొంది.

బీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు జలియన్ వాలాబాగ్ ఘటనలా .. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదుబీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు జలియన్ వాలాబాగ్ ఘటనలా .. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

 మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి ఘటన జరిగితే సైలెంట్ గా ఉంటారా ?

మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి ఘటన జరిగితే సైలెంట్ గా ఉంటారా ?

ముంగేర్ కాల్పుల ఘటనపై మాట్లాడిన రౌత్, "దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో, ముంగేర్ లో హింస చెలరేగిందని, ఆ తరువాత, పోలీసులు కాల్పులు జరిపారని , పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారని , అనేక మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది ఇది హిందుత్వంపై దాడిగా ఆయన అభివర్ణించారు . శివసేన ఎంపి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "మహారాష్ట్ర లేదా పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే గవర్నర్లు, బిజెపి నాయకులు రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేసేవారని పేర్కొన్నారు . కానీ బీహార్ గవర్నర్, బిజెపి నాయకులు ఈ సంఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో కాల్పుల ఘటన ... సీరియస్ గా ఈసిఐ .. ఎస్పీ , మేజిస్ట్రేట్ తొలగింపు

ఎన్నికల సమయంలో కాల్పుల ఘటన ... సీరియస్ గా ఈసిఐ .. ఎస్పీ , మేజిస్ట్రేట్ తొలగింపు

ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న బీహార్ లో కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్నకేంద్ర ఎన్నికల సంఘం పోలీసు సూపరింటెండెంట్, ముంగేర్ జిల్లా మేజిస్ట్రేట్ ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఎస్పీ లిపి సింగ్ తండ్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ జనతా దళ్ యునైటెడ్ పార్టీ నేత. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆమె 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఎస్పీ లిపి సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆయన్ని ఎన్నికల విధుల నుండి ఈసీఐ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

 ముంగేర్ కాల్పుల ఘటనపై విచారణ .. ఏడు రోజుల్లోనే దర్యాప్తు

ముంగేర్ కాల్పుల ఘటనపై విచారణ .. ఏడు రోజుల్లోనే దర్యాప్తు

ఈ సంఘటనపై దర్యాప్తును మగధ్ డివిజనల్ కమిషనర్ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అసంగ్బా చుబా ఏడు రోజులతో పూర్తి చేయాలని ఆదేశించింది . కొత్త జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలను ఈ రోజు ముంగేర్‌కు పంపించారు .ముంగేర్ కాల్పుల ఘటన తర్వాత సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డిఓ), ఎస్పీ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు, అనేక వాహనాలకు నిప్పంటించి, కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్టోబర్ 26 న దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం సమయంలో జరిగిన కాల్పుల సంఘటనలో ఒక వ్యక్తి మరణానికి వ్యతిరేకంగా ఈ దాడి జరిగింది .

Recommended Video

Bihar Elections 2020 Voting Underway: Modi Urges Voters కనీవినీ ఎరుగని రీతిలో ఓ రాష్ట్ర ఎన్నికలు!!
 ఎన్డీయే పాలిత రాష్ట్రం కాకుంటే బీజేపీ నేతలు రచ్చ చేసేవారు కాదా ?

ఎన్డీయే పాలిత రాష్ట్రం కాకుంటే బీజేపీ నేతలు రచ్చ చేసేవారు కాదా ?

బీహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లాలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీసులకు ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మధ్య ఘర్షణ జరగడం, కాల్పులు చోటుచేసుకోవడం ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారని తెలిసిందే . ప్రస్తుతం బీహార్ ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో ముంగేర్ ఘటనతో బీజేపీని శివసేన టార్గెట్ చేస్తుంది . విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రధాని మూగ ప్రేక్షకుడిలాగా ఉన్నారని, ఆయన తన మౌనాన్ని భగ్నం చేసి ఈ ఘటనపై మాట్లాడాలని డిమాండ్ చేస్తుంది . ఇదే సంఘటన ఎన్డీఏ పాలిత రాష్ట్రం కాకుండా వేరే చోటు చోటు చేసుకుంటే బిజెపి నేతలు ఇలాగే మౌనంగా ఉంటారా అంటూ ప్రశ్నిస్తుంది శివసేన .

English summary
Shiv Sena leader Sanjay Raut on Friday said that the Munger firing incident is an attack on Hindutva and asked why the Governor in Bihar is not raising questions about it. Speaking to the media, Mr Raut said, "During the procession of immersion of Goddess Durga idol, violence erupted in Munger. After that, the police opened fire in which one person died and many others were injured. It is an attack on Hindutva."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X