బీహార్ ఎగ్జిట్ పోల్స్ కు చెత్త రికార్డు ? ఈసారి ప్రధాన సంస్థల మౌనం వెనుక?

బీహార్ లోని 243 అసెంబ్లీ స్ధానాలకు రెండు విడతల్లో జరిగిన ఎన్నికలు ముగిశాయి. దీంతో నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎల్లుండి అసలు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు రంగం సిద్దమవుతోంది. అయితే నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్త కంఠంతో ఈసారి ఎన్డీయే గెలుపు తథ్యమని తేల్చిచెప్పేశాయి. అంతే కాదు భారీ మెజార్టీతో ఎన్డీయే గెలవబోతున్నట్లు అంచనా వేశాయి. అదే సమయంలో ప్రధాన వార్తా సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అసలు బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ గత చరిత్ర ఎలా ఉంది, ఈసారి ప్రధాన వార్తా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కు ఎందుకు దూరంగా ఉండిపోయాయో ఓసారి పరిశీలిద్దాం. బీహార్ ఎన్నికల చరిత్రను గమనిస్తే ప్రజల నాడి పసిగట్టడంలో దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమవుతూనే వస్తున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు (2020) ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి కచ్చితంగా గెలుస్తుందని ప్రధాన సంస్థలు అంచనా వేశాయి. కానీ ఆ అంచనా తప్పింది. నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో ఇండియాటుడే-యాక్సిస్, టైమ్స్ నౌ-సీఓటర్, టీవీ9 వంటి సంస్థల లెక్క తప్పింది.

generate bihar exit polls image with nitish kumar and tejashwi yadav photos

అంతకు ముందు 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా తప్పాయి. అప్పట్లో నితీశ్-లాలూ కలిసి పోటీ చేయగా.. ఈ ఎన్నికల్లో వీరిని కాదని ఎన్డీయేను ఓటర్లు గెలిపించబోతున్నారని మెజార్టీ సంస్థలు తేల్చేశాయి. ఇందులో టుడేస్ చాణక్య వంటి సంస్థలు కూడా ఎన్డీయేకు 155 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ అసలు ఫలితాల్లో మహాకూటమి 178 సీట్లతో ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు కేవలం 58 సీట్లే దక్కాయి.

generate bihar exit polls image with nitish kumar and tejashwi yadav photos

దీంతో ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా లెక్కతప్పడం ఖాయమనే అంచనాల్లో మహాకూటమి ఉంది. మరోవైపు గతంలో ఎదురైన అనుభవాలతో ఈసారి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సర్వేలకు దూరంగా ఉండిపోయాయి. ఇందులో ఇండియా టుడే, ఏబీపీతో పాటు సీఓటర్ వంటి సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ జోలికి పోలేదు. దీని కారణం కచ్చితంగా గతానుభవాలే అని అర్దమవుతోంది. బీహార్ ఓటర్ల నాడిని పసిగట్టడంలో విఫలమై పరువు పోగొట్టుకోవడం ఎందుకన్న భావన ఈసారి వీరిలో కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+