వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో మ్యాజిక్‌ మార్క్‌కు చేరుకున్న ఎన్డీయే- అనూహ్యంగా పుంజుకున్న జేడీయూ-తేజ్‌ ప్రతాప్‌ వెనుకంజ

|
Google Oneindia TeluguNews

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకూ అందుతున్న ఆధిక్యాల్లో ఎన్డీయే- మహాకూటమి ఇరువురూ పోటాపోటీగా సాగుతున్నారు. అయితే ఎన్డీయే మాత్రం మ్యాజిక్‌ మార్క్‌కు చేరువైంది. ఓ దశలో 125 సీట్ల ఆధిక్యాన్ని అందుకున్న ఎన్డీయే ప్రస్తుతం 120 సీట్ల వద్ద ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఆ వెంటనే మహాకూటమి 112 సీట్లతో తర్వాతి స్ధానంలో ఉంది.
చిరాగ్‌ పాశ్వాన్‌ ఆధ్వర్యంలోని లోక్‌జనశక్తి పార్టీ మరో రెండు నుంచి మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది.

Recommended Video

#Biharelectionresults2020: మహాకూటమి vs ఎన్డీయే..కూటముల పరంగా స్వల్ప ఆధిక్యంలో NDA

బీహార్‌ ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యం- ఆర్జేడీ మినహా రాణీంచని మిత్రపక్షాలు..బీహార్‌ ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యం- ఆర్జేడీ మినహా రాణీంచని మిత్రపక్షాలు..

8 రౌంట్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఎన్డీయే 122 సీట్ల మ్యాజిక్‌ మార్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో 22 రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో కాస్త వెనుకబడిన జేడీయూ అభ్యర్ధులు ఆ తర్వాత పుంజుకున్నారు. ప్రస్తుతం 57 సీట్లలో జేడీయూ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ జేడీయూ అభ్యర్ధులు సాధిస్తున్న ఆధిక్యత ఎన్డీయే కూటమికి ప్రయోజనం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.

bihar poll result 2020 : nda crosses magic mark in leads, rjd still keeps majority

అటు ఆర్జేడీ అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించేందుకు రంగం సిద్దమవుతోంది. అయితే మహాకూటమిలోని మిగతా మిత్రపక్షాల నుంచి ఆ పార్టీకి సహకారం కరువైంది. దీంతో ఆర్జేడీ అభ్యర్ధులు మాత్రమే ముందంజలో ఉండగా.. ఆ తర్వాత స్ధానంలో కాంగ్రెస్‌ ఉంది.
రాఘవ్‌పూర్‌ స్ధానంలో ఆర్జేడీ అభ్యర్ధి, మహాకూటమి సీఎం అభ్యర్ధి కూడా అయిన తేజశ్వీ యాదవ్ ఆధిక్యం కొనసాగిస్తుండగా.. ఊహించినట్లుగానే హసన్‌పూర్‌లో ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్‌ యాదవ్‌ వెనుకబడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు కూడా వెనుకబడినట్లు తెలుస్తోంది.

English summary
Counting of votes for the Bihar Assembly election began on Tuesday at 55 counting centres. Nda crosses magic mark of 122 seats in leads and rjd continues its lead in overall seats. while jdu increases their lead in more seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X