స్నేహితులపై దాడి: యువతుల దుస్తులు చించి, అసభ్యంగా తాకి, ఇద్దరు అరెస్ట్

పాట్నా:బీహర్ రాష్ట్రంలో కొందరు దుండగులు ఇద్దరు యువతులపై పైశాచికంగా ప్రవర్తించారు. స్నేహితులతో కలిసి వెళ్తున్న యువతులను అడ్డుకొని యువతుల దుస్తులను చించివేసేందుకు ప్రయత్నించారు. వారిని అసభ్యంగా తాకారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. మీడియా దృష్టికి ఈ దృశ్యాలు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

దేశంలో ఏదో ఒక చోట ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు.

బీహర్ లో కొందరు దుండగులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. ఇద్దరు యువతుల పట్ల అత్యంత దారుణంగా ఆ దుండగులు వ్యవహరించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని ఇప్పటికే పోలీసలు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇద్దరు యువతులపై అసభ్యంగా

ఇద్దరు యువతులపై అసభ్యంగా

బీహార్ రాష్ట్రంలోని గయలో గల వాజిర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన చోటు చేసుకొంది. మే 17 లేదా 18 తేదిల్లో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు. స్నేహితులతో వెళ్తున్న ఇద్దరు యువతలను అడ్డగించారు. స్నేహితులను చితకబాదారు. ఆ యువతుల దుస్తులను చించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు వారిని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు.

సోషల్ మీడియాలో దృశ్యాలు

సోషల్ మీడియాలో దృశ్యాలు

ఇద్దరు యువతుల దుస్తులను చించివేసేందుకు ప్రయత్నించడంతో పాటు వారిని అసభ్యంగా తాకుతూ ఆ దుండగులు పైశాచిక ఆనందానికి లోనయ్యారు. అంతేకాదు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. తక్కువ సమయంలోనే ఈ వీడియోలు ఎక్కువమందికి చేరుకొన్నాయి.

మీడియా కారణంగా వెలుగులోకి

మీడియా కారణంగా వెలుగులోకి

సోషల్ మీడియాలో ఇద్దరు యువతుల దుస్తులను లాగేసి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. యువతుల పట్ల ఆ దుండగులు ఏ రకంగా వ్యవహరించారనే దానిపై మీడియా సవివరంగా వార్తా కథనాలను ప్రసారం చేసింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు.

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇద్దరు యువతుల పట్ల దుండగులు దారుణంగా ప్రవర్తించడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టుగా గయ ఏఎస్పీ రాజీవ్ మిశ్రా ప్రకటించారు. మీడియా ద్వారా విషయం తెలిసినట్టు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విజయ్ యాదవ్, సుధీర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. మిగిలిన నిందతులను కూడ అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+