జిల్లాను పక్క రాష్ట్రానికి అమ్మేస్తున్న మహిళా మంత్రి, సింపుల్ గా సినిమా చూస్తున్న సీఎం, ఇది లెక్క !

కర్ణాటకలో అంతర్భాగమైన బెళగావి జిల్లా హారాష్ట్రకే చెందుతుందని సీఎం సిద్ధరామయ్య కేబినెట్ లోని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ చెబుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బెళగావి జిల్లా విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం వైఖరిని వెల్లడించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాను మహారాష్ట్రాకు అమ్మేయడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అయ్యిందని బీజేపీ ఆరోపిస్తున్నది.

సిద్దరామయ్య ప్రభుత్వం తీరు చూస్తుంటే బెళగావి జిల్లాను విక్రయించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అనిపిస్తోందని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్ణాటక బీజేపీ శాఖ విరుచుకుపడింది. దీనిపై బుధవారం ట్వీట్ చేసిన బీజేపీ కన్నడిగులను విభజించాలని ప్రతయ్నం చేస్తున్నారని, కర్ణాటకను విభజించాలని కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులకు తగిన గుణపాఠం చెబుతారని కర్ణాటక బీజేపీ శాఖ హెచ్చరించింది.

BJP accuses minister Lakshmi Hebbalkar of trying to sell Belagavi district to Maharashtra

బెళగావి మహారాష్ట్రకే చెందుతుందని కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ చెబుతున్నారని, కర్ణాటకకు ద్రోహం చేసే ప్రకటనలు చేస్తున్నారని, బెళగావిలో రికార్డుల సేకరణ పని మొదలైందని బీజేపీ ఆరోపించింది. . బెళగావిలో జరుగుతున్న ఈ అక్రమాన్ని ఖండించడానికి బదులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నెముక లేని విధంగా ప్రవర్తించిందని, బెళగావిని అమ్ముకునేలా సొంత మంత్రులనే వదిలేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నడ గుర్తింపు అనేది లేకుండా చేస్తున్నారని, బెళగావి విషయం కేవలం ఎన్నికల విషయమని నిరూపించి ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌ చెప్పినట్లు తల ఆడిస్తున్నారని, అందుకే బెళగావిని అమ్మేయడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకులు ఆరోపించారు. కన్నడ నేల, నీరు, భాష విషయంలో బీజేపీ ప్రభుత్వం ఏనాడూ రాజీపడకుండా కన్నడ గుర్తింపును నిలబెట్టి భూమిని కాపాడిందని బీజేపీ నాయకులు గుర్తు చేశారు.

BJP accuses minister Lakshmi Hebbalkar of trying to sell Belagavi district to Maharashtra

కన్నడ బాష సమస్యపై కాంగ్రెస్ పనికిమాలిన రాజకీయాలు చేయడం, భూమి రక్షణను విస్మరించడం చేస్తోందని, కన్నడపై కాంగ్రెస్‌కు ఉన్న పగటి ప్రేమకు ఇది నిదర్శనం అని, అధికారం ఉందనే మోజులో సిద్దరామయ్య ప్రభుత్వం బెళగావి విషయంలో కాలక్షేపం చేస్తూ కర్ణాటక ప్రయోజనాలను మరిచిందని, కర్ణాటకకు మంచి గుర్తింపు రాకుండా చెడగొట్టేందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేస్తున్నది కన్నడిగులకు ద్రోహం అని బుధవారం కర్ణాటక బీజేపీ శాఖ ట్వీట్ చేసింది.

సిద్దరామయ్య ప్రభుత్వం మీద బీజేపీ చేసిన ఆరోపణలు

బెళగావి జిల్లా వేరే రాష్ట్రానికి చెందినదని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అంటున్నారని బీజేపీ ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కావేరీ నీటిని దొంగతనంగా తమిళనాడుకు విడుదల చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కన్నడ తల్లి భువనేశ్వరి విగ్రహం బదులుగా కర్ణాటకలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

హంపి ఉత్సవాలు నిర్వహించకుండా కన్నడ సంస్కృతిని నాశనం చేస్తున్నారని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్నడిగుల సొమ్మును దుర్వినియోగం చేశారని, కర్ణాటకలో కన్నడ ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలోని వారసత్వ భవనాల పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు చెయ్యకుండా సిద్దరామయ్య ప్రభుత్వం కాలం గడిపేస్తోందని బీజేపీ ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+