సర్వేల్లో మోడీయే: బిజెపికి 217, కాంగ్రెస్‌కు 73 సీట్లు

BJP to bag 217 seats, Congress 73: Survey
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్ది భారతీయ జనతా పార్టీ హవా పెరుగుతుండగా, కాంగ్రెసు పార్టీ సీట్ల సంఖ్య తగ్గుతున్నట్లుగా సర్వేలను బట్టి తెలుస్తోంది. రానున్న లోకసభ ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుందని ఎబిపి న్యూస్ - నీల్సన్ సర్వేలో వెల్లడయింది. ప్రధానిగా ఎక్కువ మంది నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపుతున్నారు.

సర్వే ప్రకారం... బిజెపికి 217 సీట్లు, కాంగ్రెస్‌కు 73 సీట్లు వచ్చే అవకాశముంది. ఫిబ్రవరి 4-15 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. బిజెపితో కూడిన ఎన్డీయే కూటమికి 236 సీట్లు వచ్చే అవకాశముంది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి) 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

దక్షిణాదిన కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండొచ్చు. అలాగే ప్రధానిగా మోడీకే తమ మద్దతు ఉంటుందని 57 శాతం మంది, రాహుల్ గాంధీకి ఉంటుందని 18 శాతం మంది స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు కేవలం 3 శాతం మందే మద్దతు పలికారు. వివిధ పార్టీల కూటమి అయిన ఫెడరల్ ఫ్రంట్ 186 సీట్లు గెలుచుకునే అవకాశముంది.

తృణమూల్ 29, అన్నాడిఎంకె 19, బిజెడి 16, బిఎస్పీ 13, డిఎంకె 13, జెడి(యు) 9 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అవినీతి ప్రధానమైనదని 34 శాతం మంది భావిస్తుండగా.. నిరుద్యోగమే ప్రధాన సమస్య అని 18 శాతం అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+