మేనక లేఖపై బీజేపీ, జయను కదిలించిన రజనీ లేఖ
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కేంద్రమంత్రి మేనకా గాంధీ రాసిన లేఖ పైన బీజేపీ ఆచితూచి స్పందిస్తోంది. సోమవారం నాడు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర రావు చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. మేనక లేఖ రాయడం రాసినంత మాత్రాన తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన తమ ఆలోచన మారదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి మేనకా గాంధీ ఆదివారం జయలలితకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కష్టాలు తొలిగి, మళ్లీ సీఎం పీఠంపై కూర్చోవాలని జయకు రాసిన లేఖలో మేనకా గాంధీ ఆకాంక్షించారు. ఇది కలకలం రేపింది. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ లేఖ రాయడం కూడా చర్చకు దారి తీసింది. రజనీకాంత్ తన లేఖలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జయ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వారి లేఖల పైన జయ స్పందించారు కూడా. రజనీకాంత్, మేనకలకు జయ 'థాంక్స్' చెప్పారు. ఈ మేరకు లేఖలు రాశారు. కేంద్రమంత్రిగా ఎంతో బిజీగా ఉండి కూడా తన గురించి ఆలోచించడం తనను కదిలించిందని, మీ ఉత్తరం నా మనసు లోతులను తాకిందని మేనకకు కృతజ్ఞతలు తెలిపారు.
రజనీకాంత్‌కు రాసిన లేఖలో... మీ ఉత్తరం చూసి ఎంతో సంతోషించానని, అందులో మీరు వ్యక్తం చేసిన సానుభూతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, మీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
జయ జైల్లో ఉన్నప్పుడు బిజీ..!
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు స్థానిక విలేకరులు బిజీబీజీగా ఉండేవారు. వారికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డెవలప్‌మెంట్స్ ఉండేవి. అయితే, జయ జైలు నుండి విడుదలై చెన్నైకి వెళ్లాక వారు బోర్‌గా ఫీలవుతున్నారట.












Click it and Unblock the Notifications