Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాలిపోతున్న ఆరెస్సెస్ నిక్కర్-కాంగ్రెస్ ట్వీట్ పై దుమారం-బీజేపీ ఎదురుదాడి..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంగొత్త వ్యూహాల్ని అమలుచేస్తోంది. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలానికి, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర నేపథ్యంలో.. దానికి మద్దతుగా బీజేపీ, ఆరెస్సెస్ పై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఇదే క్రమంలో ఆరెస్సెస్ చెడ్డీ ఫొటోతో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్వీట్ లో ఆరెస్సెస్ చెడ్డీ తగలబడుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఫొటోతో పాటు మరో 145 రోజులంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది. దీంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరో 145 రోజులు పూర్తి చేసుకుంటే భారత్ లో విద్వేషం కూడా ఇలా కాలిపోతుందనే అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ పెట్టారు. దీంతో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన పోరాటాన్ని ప్రతిబింబించేలా ఈ ట్వీట్ పెట్టిన్నట్లు తెలుస్తోంది. దీంతో సహజంగానే బీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు దీనికి కౌంటర్లు మొదలుపెట్టాయి.

bjp fire on congresss tweet with burning rss knicker- target rahuls bharat jodo yatra


కాంగ్రెస్ పెట్టిన ఈ ట్వీట్ తో భారత్ లో విద్వేషం నింపదల్చుకున్నారా అంటూ బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ప్రశ్నించారు. అలాగే బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య కూడా రెచ్చిపోయారు. గతంలో 1984లో కాంగ్రెస్ ఢిల్లీలో ఓ నిప్పు పెట్టిందని, ఆ తర్వాత 2002లో కరసేవకుల్ని ఆ పార్టీ సానుభూతిపరులు గోద్రాలో నిప్పుపెట్టారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హింసను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ రాజేసిన నిప్పుతో గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయారని, ఇప్పుడు రాజస్తాన్,ఛత్తీస్ ఘడ్ లో కూడా అధికారం పొగొట్టుకుంటారని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+