వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా ఎన్నికలపై బీజేపీ ఫోకస్ .. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పర్యటన, కారకర్తలకు దిశా నిర్దేశం

|
Google Oneindia TeluguNews

గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గోవాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జెపి నడ్డా, ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందే వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని, సాధికారత సాధించడానికి మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలను కోరారు. నడ్డా నవంబర్ 24 నుంచి రెండు రోజుల పాటు గోవాలో పర్యటిస్తున్నారు.ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తన రెండు రోజుల పర్యటనలో, బిజెపి చీఫ్ పార్టీ నాయకులతో కలిసి పనాజీలోని మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు.

గోవా సీఎం అవ్వటానికి రాలేదు; ఢిల్లీ నుండి కేంద్రం దాదాగిరి ఆపటానికే వచ్చా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీగోవా సీఎం అవ్వటానికి రాలేదు; ఢిల్లీ నుండి కేంద్రం దాదాగిరి ఆపటానికే వచ్చా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న జేపీ నడ్డా

గోవాలోని వాల్పోలో గురువారం జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ, సామాజిక అవసరాలకు తగ్గట్టు పార్టీ పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆకాంక్షల మేరకు పని చెయ్యాలని, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.సమాజం యొక్క ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా మనం పని చేయాలని, ప్రధాని మోదీ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ఔర్ సబ్‌కా ప్రయాస్ కింద రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మనం గోవాలో కలిసి పని చేయాలని గోవాలో పార్టీని ముందుకు నడిపించాలని, రాష్ట్రంలో చివరి వ్యక్తిగా ఉండే వారికి కూడా సాధికారత కల్పించేందుకు మనం కృషి చేయాలని ఆయన అన్నారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పావులు కదుపుతున్న బీజేపీ

గోవాలో అసెంబ్లీ ఎన్నికలు 2022 ప్రారంభంలో జరగనున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బిజెపి నియమించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ దర్శన్ జర్దోష్‌లను నియమించారు. గోవాలో 2017 అసెంబ్లీ ఎన్నికలలో, 40 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ అత్యధికంగా 17 స్థానాలను గెలుచుకుంది. గోవాలో గత ఎన్నికల్లో బిజెపిని 13కి పరిమితం చేసింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చిన ,భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని సీనియర్ నాయకుడు మనోహర్ పారికర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటం కోసం ఇప్పటి నుండే పావులు కదుపుతుంది.

గోవా ఎన్నికల బరిలో ... ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ టీఎంసి

గోవా ఎన్నికల బరిలో ... ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ టీఎంసి

ఈసారి గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే బరిలోకి దిగింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు తమ పార్టీ అయితే స్థానికులకు 80% ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల పనాజీ పర్యటన సందర్భంగా ఆయన అనేక ఆసక్తికరమైన హామీలు ఇచ్చారు. అదనంగా, మమతా బెనర్జీ యొక్క తృణమూల్కూ కాంగ్రెస్డా పార్టీ కూడా గోవా ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఇటీవల గోవా మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ కాంగ్రెస్ నాయకుడు లుజిన్హో ఫలేరో, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌లను పార్టీలో చేర్చుకున్న మమతా బెనర్జీ
బీజేపీ సర్కార్ పై ధ్వజమెత్తుతోంది.

 గోవాలో బీజేపీతో తలపడనున్న దీదీ .. రసవత్తరంగా గోవా పోరు

గోవాలో బీజేపీతో తలపడనున్న దీదీ .. రసవత్తరంగా గోవా పోరు

ఇటీవల గోవాలో పర్యటించిన సందర్భంలో మమతా బెనర్జీ చేపలు మరియు ఫుట్‌బాల్ బెంగాల్ మరియు గోవాలను కలిపే రెండు అంశాలు అని పేర్కొన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాష్ట్రంలో తాను సీఎం అవడానికి రాలేదని కేంద్రం కబంధ హస్తాల నుండి గోవాను రక్షిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం యొక్క దాదాగిరిని తాను అనుమతించబోనని తేల్చి చెప్పారు. ఇకపై ఢిల్లీ నుండి బెదిరింపులు ఉండవు అని పేర్కొన్నారు. తాను బయటి వ్యక్తిని కాదని పేర్కొన్నారు మమతాబెనర్జీ .ఇదే సమయంలో తాను, గోవాకు సీఎం కావాలనుకోలేదు అని మమతా బెనర్జీ కొంకణిలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ఈ సారి గోవా ఎన్నికల పోరు రసవత్తరంగా జరగనుండటంతో బీజేపీ కూడా పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి సారించింది.

English summary
The BJP has focused on the Goa elections. BJP chief JP Nadda visit to goa created interest. JP Nadda directed the activists to go ground level. The BJP, which is focused on strengthening the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X