మోదీ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, రంగంలోకి నటి, అదే జరిగితే తెలుగింటి ఆడపడుచు !
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన బీజేపీ, జేడీఎస్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపు విషయమై ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నేతలతో చర్చలు జరుగుతున్న సమయంలో మండ్య సీటు మీద ఆ నియోజక వర్గం ఎంపీ సుమలత అంబరీష్ ఆశలు వదులుకోవాల్సి వస్తోందని వెలుగు చూసింది.
బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ, తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ నటి సుమలత అంబరీష్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో పాటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే మూడు, నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించి లోక్ సభ ఎన్నికలపై చర్చలు జరిపారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజకవర్గాల్లో కేవలం ఒకేఒక్క నియోజకవర్గం మాత్రమే బీజేపీ హైకమాండ్ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది.

పాత మైసూర్‌లో జేడీఎస్ ప్రాబల్యం రోజురోజుకూ తగ్గిపోవడంతో దళపతులు తమ ప్రాబల్యాన్ని మళ్లీ పెంచుకునేందుకు మండ్య లోక్‌సభ నియోజకవర్గాన్ని మాకు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నేతల ముందు డిమాండ్ చేశారు. సీట్ల కేటాయింపు వ్యవహారం ఇప్పటికే ఖరారైందని, బీజేపీకి మద్దతు తెలిపిన సుమలత మండ్య లోక్ సభ నియోజక వర్గం కచ్చితంగా వదులుకోవలసి వస్తోందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.
అయితే తాను మండ్య నుంచే పోటీ చేస్తానని సుమలత కొన్ని రోజుల క్రితం వరకు గట్టిగానే చెప్పారు. దీంతో మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు వదులుకుని, జేడీఎస్ ఆధిపత్యం ఉన్న బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి సుమలత అంబరీష్‌ను పోటీకి దింపాలని సుమలతతో బీజేపీ హైకమాండ్ నేతలు చర్చించినట్లు సమాచారం. ఈసారి మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేయడం ద్వారా కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని ప్లాన్ చేశారని తెలిసింది.
దీంతో మండ్య లోక్‌సభ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నేతలతో పాటు బీజేపీ హైకమాండ్ సుమలతకు బుజ్జగించారని తెలిసింది. ఇప్పటికే పలుసార్లు బీజేపీ హైకమాండ్ తో జేడీఎస్ చర్చలు జరిపింది. మండ్య లోక్ సభ నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు ఇచ్చి బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో సుమలతను పోటీకి దించి డీకే శివకుమార్ సొంత తమ్ముడు డీకే సురేష్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు ఆలోచిస్తున్నారు.

బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ డీకే సురేష్ ఈసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనుమానంగానే ఉంది. అందుకే ఈ నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఒకే ఒక్క నియోజక వర్గంలో విజయం సాధించిన కాంగ్రెస్ 2019లో గెలవడం కష్టమనే మాట వినిపించింది.
బీజేపీ, జేడీఎస్ కూటమి అభ్యర్థిగా సుమలతను నిలబెట్టి ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. జేడీఎస్ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్న బీజేపీ హైకమాండ్ జేడీఎస్ నేతలు కోరిన మండ్య లోక్ సభ నియోజకవర్గాన్ని వారికి వదిలేసి బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి మండ్య సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుమలతను పోటీ చేయించాలని ప్లాన్ చేశారు. బెంగళూరు రూరల్ నుంచి సుమలతను పోటీ చేయించి డీకే సోదరుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని వెలుగు చూసింది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications