పెళ్లి జరిగిన నెల రోజుల్లో ప్రియుడితో భార్య జంప్, భర్త ఇద్దరిని స్పాట్ లో ఎలా చంపాడంటే ?
పెళ్లయిన నెల రోజుల్లోనే ప్రియుడితో కలిసి పరారైన భార్యను, ఆమె ప్రియుడిని మాజీ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి తాలూకాలో కొకటనూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.మాజీ భార్య, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు అడ్డుపడిన
అత్త, మామలపై వేటకొడవలితో దాడి చేసి దర్జాగా వెళ్లిపోయాడు.
మాజీ భార్య ప్రియుడు
యాసీన్ బాగోడే అలియాస్ యాసీన్ (21), మాజీ భార్య హీనా కౌసర్ సుదారనే అలియాస్ హీనా (19) అనే యువతి హత్యకు గురైనారు. మాజీ భర్త తౌఫిక్ కాడి అలియాస్ తౌఫిక్ (24) అనే యువకుడు జంట హత్యలు చేసి పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. జంట హత్యల సమయంలో యువతిని రక్షించేందుకు మధ్యలోకి వచ్చిన అత్తమామలపై నిందితుడు తౌఫిక్ దారుణంగా దాడి చేసి పరారయ్యాడు.

ఈ ఘటనలో గాయపడిన యువతి తల్లి అమీనాబాయి బాగుడ, మామ ముస్తఫా ముల్లా మీరజ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీనా, తౌఫిక్‌లకు వివాహం చెయ్యాలని రెండు వైపుల కుటుంబ సభ్యలు మాట్లాడుకున్నారు. నాలుగు నెలల క్రితమే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా వివాహమైంది. అయితే పెళ్లికి ముందే హీనాకు యాసీన్ అనే ప్రియుడు ఉన్నాడని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసినా ఆ విషయం మూసిపెట్టి తౌఫిక్ తో పెళ్లి జరిపించారు.
పెళ్లి చేసుకున్న హీనా ఆమె భర్త తౌఫిక్ ఇంటికి వెళ్లి అతనితో కళ్లుమూసుకుని కాపురం చేసింది. వివాహం అయిన నెల రోజులకే హీనా ఆమె ప్రియుడు యాసీన్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. భర్త హీనా పరిపోవడంతో తౌఫిక్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పోలీసు కేసు పెట్టాడు. ప్రియుడితో పారిపోయిన నెలన్నర తర్వాత హీనా, ఆమె ప్రియుడు యాసీన్ పోలీసులకు చిక్కిపోయారు. అయితే ముస్లీం మత పెద్దల సమక్షంలో రాజీ పంచాయతీ చేసి సమస్యను పరిష్కరించారు.
రాజీ పంచాయితీ సమయంలో మత పెద్దలు హీనాకు, ఆమె భర్త తౌఫిక్‌తో విడాకులు ఇప్పించారు. భర్త తౌఫిక్ తో విడాకులు తీసుకున్న హీనా ఆమె ప్రియుడు యాసిన్‌తో వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అక్కడే పెళ్లికూడా జరిపించారని సమచారం. ప్రేమించిన యాసీన్ ను రెండో పెళ్లి చేసుకున్న హీనా అతనితో వెళ్లిపోయింది. వివాహం జరిగిన నెల రోజుల్లో భార్య హీనా ఆమె ప్రియుడితో లేచిపోవడం, నాలుగు నెలలు కాకుండా విడాకులు కూడా రావడంతో కోపోద్రిక్తుడైన తౌఫిక్ మాజీ భార్య హీనా, ఆమె ప్రియుడు యాసీన్ అంతు చూడాలని అనుకున్నాడు.

మంగళవారం రాత్రి మాజీ భార్య హీనా, ఆమె రెండో భర్త యాసీన్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన తౌఫిక్ వేట కొడవలి తీసుకుని ఇద్దరిని నరికేశాడు. అదే సమయంలో అడ్డుపడిన అత్తమామలను కూడా నరికేసిన తౌఫిక్ తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతానని అక్కడ ఉన్నవాళ్లకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తీవ్రగాయాలైన హీనా, ఆమె రెండో భర్త స్పాట్ లో ప్రాణాలు వదిలేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు జంట హత్యల కేసు నిందితుడు తౌఫిక్ కోసం గాలిస్తున్నారు. వివాహం చేసుకున్న నెల రోజులకే ప్రియుడితో పారిపోయి అతన్ని రెండో పెళ్లి చేసుకున్న హీనా ఆమె మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురికావడం బెళగావి జిల్లాలో కలకలం రేపింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications