వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో బీజేపీకి నాయకత్వం లోపించింది: అరవింద్ కేజ్రీవాల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై మరోసారి ధ్వజమెత్తారు. తమపై ఆరోపణలను తగ్గించకుంటే కోర్టుకు లాగుతామన్న బీజేపీకి ఏమాత్రం బెదిరేది లేదన్నారు. ఇంకో అడుగు ముందుకేసి బీజేపీకి ఢిల్లీలో నాయకత్వమే లేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘‘ఢిల్లీలో బీజేపీ క్రమంగా దిగజారుతోంది. అజెండా లేదు. దిశ లేదు. నాయకత్వమూ లేదు. అందుకే ఆ పార్టీ భగోడా (పలాయన) అజెండాను ప్రజలు తిరస్కరిస్తున్నారు'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఇటీవల హర్యానా, మహారాష్ట్రల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ, రెండు రాష్ట్రాల్లోనూ సరైన పాలన సాగించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై తాజాగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రతిపక్ష పార్టీలు భగోడా (పలాయన)గా అభివర్ణిస్తున్నారు.

BJP lacks leadership in Delhi: Arvind Kejriwal

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి విజయం సాధిస్తుదంటూ ఓ ప్రముఖ టీవి ఛానల్‌లో వచ్చిన ఓపినియిన్ పోల్‌ను అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నిధుల సేకరణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కే్జ్రీవాల్ ప్రముఖులకు 'విందు' ఇస్తున్నారు. ప్రముఖులకు విందు ఇచ్చి వారి నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ఇటీవలే కేజ్రీవాల్ ముంబైలో వజ్రాల వ్యాపారులు, బ్యాంకర్లు ఇతర ప్రముఖులకు విందు ఇచ్చారు. విందులో పాల్గొన్నవారు ప్లేటు భోజనానికి 20 వేల రూపాయల చొప్పున చెల్లించారు. దీని ద్వారా మొత్తం 91 లక్షల రూపాయలు సేకరించారు.

English summary
AAP chief Arvind Kejriwal today hit back at the BJP over lack of leadership and agenda in Delhi and said people are rejecting its 'bhagoda' (deserter) agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X