వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోనాలీ ఫోగట్ గోవాలో మృతి

|
Google Oneindia TeluguNews

పనాజి: బీజేపీ నాయకురాలు, నటి, మాజీ టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ సోమవారం రాత్రి గుండెపోటుతో గోవాలో మరణించారు. అంతకుముందు 41 ఏళ్ల ఆమె అస్వస్థతకు గురైంది.ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు.

గోవాకు షూటింగ్ కోసం వచ్చి మరణించని సోనాలీ ఫోగట్

గోవాకు షూటింగ్ కోసం వచ్చి మరణించని సోనాలీ ఫోగట్

రెండు రోజుల షూటింగ్ కోసం సోనాలి తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె గుండెపోటుతో మరణించారు. బంబోలిమ్ డిప్యూటీ ఎస్పీ జీవ్బా దల్వీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకురాలిని ఆసుపత్రికి తరలించారని, విచారణ పురోగతిలో ఉందని చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోనాలీ ఫోగట్

సోనాలి ఫోగట్ 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆడమ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన కుల్దీప్ బిష్ణోయ్‌పై ఆమె పోటీ చేసింది. ఆమె పోటీలో 29,471 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సోనాలి హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భూతాన్ కలాన్ గ్రామానికి చెందినవారు. హిసార్‌కు చెందిన రాజకీయ నాయకుడు సంజయ్ ఫోగట్‌ను వివాహం చేసుకుంది. ఆమె భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన కూడా గుండెపోటుతోనే మరణించడం గమనార్హం. సోనాలి తన కుమార్తె యశోధర ఫోగట్‌తో కలిసి ఉంటోంది.

సోమవారం రాత్రి కూడా ఇన్‌స్టాలో వీడియో పోస్టు చేసిన సోనాలీ

అడంపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాల మధ్య సోనాలి గత వారం కుల్దీప్ బిష్ణోయ్‌ని కలిశారు. సోనాలి ఫోగట్ సోమవారం రాత్రి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సోమవారం ఆలస్యంగా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తన ప్రొఫైల్ చిత్రాన్ని కూడా మార్చారు. సోనాలి ఫోగట్ వివిధ టీవీ సీరియల్స్‌లో నటించారు. హర్యాన్వి సినిమాల్లో అలాగే సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ 14లో నటించారు.

English summary
BJP Leader, actor Sonali Phogat Dies In Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X