పెళ్లికి చీఫ్ గెస్ట్, వధువు మెడలో తాళి కట్టబోయిన సుబ్రమణ్యస్వామి (వీడియో)

చెన్నై: తమిళనాడులో తిరుగులేని నాయకురాలిగా ఉన్న జయలలిత మీద అక్రమ ఆస్తుల కేసు పెట్టి ఆమెను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన బీజేపీ నేత డాక్టర్ సుబ్రమణ్యస్వామి ఒక పెళ్లి వేడుకలో విచిత్రంగా ప్రవర్థించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మంగళవారం చెన్నయ్ లో ఒక నాయకురాలి కుమారుడి పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి బీజేపీ నేత డాక్టర్ సుబ్రమణ్యస్వామిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. కళ్యాణ మండపం దగ్గర ఆయన ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పెళ్లికి వెళ్లారు.

BJP leader Subramanian Swamy has created shock in Nellai Wedding function.

పెళ్లి కుమారుడు తాళి కట్టడానికి సిద్దంగా ఉన్నారు. పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు సుబ్రమణ్యస్వామి దగ్గరకు తాళి ఇచ్చారు. వెళ్లి పెళ్లి కుమారుడికి తాళి ఇచ్చి ఆశీర్వదించాలని మనవి చేశారు. సుబ్రమణ్య స్వామి తాళి తీసుకుని పెళ్లి కుమార్తె దగ్గరకు వెళ్లారు.

తాళికి నమస్కరించిన ఆయన పెళ్లి కుమార్తె మెడలో కట్టడానికి ప్రయత్నించారు. అంతే పక్కనే ఉన్న పెళ్లి కుమారుడి తల్లి సుబ్రమణ్యస్వామిని వారించారు. పెళ్లి కుమారుడి దగ్గరకు తాళి ఇవ్వాలని చెప్పారు. అంతే ఈ సంఘటనతో పెళ్లి కుమారుడితో పాటు అతని కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారు షాక్ తిన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+