1977లో ఓటేయలేని కాంగ్రెస్ ఇప్పుడులేదు:శశిథరూర్
బెంగళూరు: 2009-14 మధ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి, 1977లో తాను ఓటు వేయలేని కాంగ్రెస్ పార్టీ లాంటిది కాదని ఆ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యులు శశిథరూర్ చెప్పారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఆయన శనివారం ప్రసంగించారు.
పూర్వ విద్యార్థుల సమాలోచన, నాయకత్వ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో తాను సేవలను ముగించుకున్న అనంతరం బిజెపి, లెఫ్ట్ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు తనను ఆయా పార్టీల్లోకి ఆహ్వానించాయని చెప్పారు.

తాను మాత్రం సరైన పార్టీనే ఎంచుకున్నానని చెప్పారు. మీరు సరికాని పార్టీలో సరైన వ్యక్తిగా ఉన్నానని భావిస్తున్నారా అని కొందరు ప్రశ్నించగా... ఎన్నో పార్టీలు పిలిచినప్పటికీ తాను సరైన పార్టీనే ఎంచుకున్నానని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ చెప్పారు.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్... 1977లో తాను ఓటు వేయలేని కాంగ్రెస్ పార్టీ లాంటిది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది మంచివారు, మేధావులు ఉన్నారన్నారు. ఓ రచయితగా ఎమర్జెన్సీని విమర్శించానని, అలాగే సిక్కు అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేతలను విమర్శించానని చెప్పారు.












Click it and Unblock the Notifications