రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆజాద్ ..!? బీజేపీ నయా స్ట్రాటజీ - సీఎం జగన్ ను ఒప్పించాలంటూ..!!
రాష్ట్రపతి ఎన్నిక పైన అధికార బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు..అందులో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో చివరి దశ పోలింగ్ మాత్రమే ఉంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ టార్గెట్ గా..బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఒకే కూటమిగా కదులుతున్నాయి. ఆ దిశగా కసరత్తు..మంతనాలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో బీజేపీకి షాక్ ఇవ్వాలని మోదీ వ్యతిరేక పార్టీల నేతలు భావిస్తున్నారు. దీంతో..ప్రధాని మోదీ ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. రాష్ట్రపతి అభ్యర్దిగా కీలక ప్రతిపాదనతో సిద్దం అయినట్లు సమాచారం.

ప్రధాని మోదీ వ్యూహాత్మక అడుగులు
తమను వ్యతిరేకించే పార్టీలు సైతం కాదనలేని విధంగా తామే అభ్యర్ధిని ప్రతిపాదించాలని నిర్ణయించారు. దీని కోసం కాంగ్రెస్ సీనియర్ నేత...జమ్ము కాశ్మీర్ కు చెందిన గులాం నబీ ఆజాద్ ను రంగంలోకి దించాలని ప్రధాని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆజాద్ కు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. ఆయన గత ఏడాది ఏప్రిల్ వరకూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆజాద్ ను ఎంపిక చేయటం ద్వారా కాంగ్రెస్ కు షాక్ ఇవ్వటంతో పాటుగా..ఇతర పార్టీల మద్దతు సులభమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేలా
కాంగ్రెస్ అధినాయకత్వం పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కీలక నేతల బృందానికి గులాంనబీ నాయకుడిగా వ్యవహరించారు. తన రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తరువాత ప్రస్తుతం ఆయన కొంత మౌనంగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి ఏ రాష్ట్రంలో సమస్య వచ్చినా..దానిని పరిష్కరించగల నేతగా పార్టీలో ఆజాద్ కు గుర్తింపు ఉంది. ఆజాద్ రాజ్యసభ నేతగా పదవీ విరమణ సమయంలో ప్రధాని మోదీ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు.. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో మైనార్టీ వర్గానికి అందునా జమ్ము కాశ్మీర్ కు చెందిన వ్యక్తికి ఇవ్వటం ద్వారా ఇతర పార్టీల నుంచి మద్దతు పొందటం సులభం అవుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

నాటి మద్దతు నేడు లేకపోవటంతో
రాష్ట్రపతి ఎన్నికలకు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే ఓటు విలువ 208 అయితే ఎంపీ ఓటు విలువ 708. ఎలక్టోరల్ కాలేజీలో సగం ఓట్లు సాధించాలన్నా రాష్ట్రపతిగా ఎంపికయ్యే అభ్యర్థికి 5,49,452 ఓట్లు రావాలి. ప్రస్తుతం బీజేపీకి 4,74,102 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు 7,02,044 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు 3,67,314 ఓట్లు లభించాయి. కాగా, అప్పట్లో అన్నాడీఎంకె, జేడీ(యూ), బీజేడీ, టీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీ, శివసేన, అకాలీదళ్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కోవింద్‌కు మద్దతిచ్చాయి. 2017లో పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, తమిళనాడులో అన్నాడీఎంకే అండగా నిలిచాయి. ఇప్పుడు అకాలీ, శివసేన దూరమయ్యాయి.

ప్రతిపక్షాలు సైతం కసరత్తులో
ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నుంచి రాష్ట్రపతి అభ్యర్ధి పైన కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా..ఎన్డీఏ నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీ (యూ) నేత నితీశ్ కుమార్ బయటకు వస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే విషయం యోచిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇటీవల అన్నారు. అయితే, నితీశ్ దీనిని ఖండించారు. శరద్ పవార్ పేరు ప్రచారంలో ఉంది. అయితే, ఆజాద్‌ను కనుక బీజేపీ రంగంలోకి దించితే ప్రతిపక్ష శిబిరం చీలిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆజాద్ లౌకిక భావాలు, చిరకాల అనుబంధం రీత్యా ఆయనకు కొన్ని పార్టీలు మద్దతునిస్తాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఆజాద్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించారని తెలుస్తోంది.

జగన్ మద్దతు కోరుతూ మంతనాలు..
ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ఉన్న ఒక సీనియర్ నేతను ఇటీవల ఆజాద్ ఢిల్లీ పిలిపించుకుని ఈ విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది. వైసీపీ మద్దతిచ్చే విషయమై జగన్‌ను ఒప్పించాల్సిందిగా కోరినట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో ఆజాద్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అయితే, కాంగ్రెస్ నేతగా వ్యవహరించిన ఆజాద్ పట్ల సీఎం జగన్ వైఖరి ప్రతికూలంగా ఉంటుందనే అంచనాతో..ముందుగానే మంతనాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నిక సమయంలోనూ అత్యున్నతి పదవులకు పోటీ ఉండకూడదనేది తమ విధానమని గతంలోనే జగన్ స్పష్టం చేసారు. అందుకే తాము మద్దతు ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇక, ఇప్పుడు సీఎం జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది.. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications