చెక్ బౌన్స్ కేసు: బళ్లారి శ్రీరాములుకు కోర్టు ఆదేశాలు

బెంగళూరు: చెక్ బౌన్స్ కేసులో కోర్టు ముందు విచారణకు కచ్చితంగా హాజరు కావాలని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బళ్లారి శ్రీరాములకు న్యాయస్థానం ఆదేశించింది. ఆగస్టు 6వ తేదిన శ్రీరాములు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సోమణ్ణ అనే వ్యక్తి సమర్పించిన చెక్ బౌన్స్ కేసు అర్జీని విచారించిన బెంగళూరు 13వ ఏసీఎంఎం న్యాయస్థానం పార్లమెంట్ సభ్యుడు శ్రీరాములు ఇప్పటి వరకు ఎందుకు విచారణకు హాజరుకాలేదని ఆయన తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది.

2013వ లో జరిగిన శాసన సభ ఎన్నికలలో మైసూరు సమీపంలోని హెచ్.డి. కోట నుండి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేసిన సోమణ్ణ ఓడిపోయారు. తరువాత తనకు ఎంఎల్ సీ టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి రెండు సార్లుగా రూ. 1.50 కోట్లు తీసుకున్నారని సోమణ్ణ అంటున్నారు.

BJP MP B Sriramulu check bounce case in Bangalore

తరువాత రాయచూరు లోక్ సభ నుండి పోటి చెయ్యడానికి బీజేపీ టిక్కెట్ ఇప్పిస్తానని నమ్మించి రూ. 1.46 కోట్లు తీసుకున్నారని సోమణ్ణ ఆరోపిస్తున్నాడు. తనకు ఎలాంటి పని చేసి పెట్టకపోవడంతో తీసుకున్న సోమ్ము తిరిగి ఇవ్వాలని తాను శ్రీరాములకు చెప్పానని సోమణ్ణ అంటున్నారు.

2014 మార్చి 20వ తేదిన తనకు శ్రీరాములు చెక్ ఇచ్చారని, బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎన్ జీ వైశ్యా బ్యాంక్ లో చెక్ వేస్తే అది బౌన్స్ అయ్యిందని సోమణ్ణ అన్నారు. అందుకే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆయన చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+