ఇద్దరు సీఎంలు కుర్చుని మాట్లాడుకుంటే క్లియర్, స్టాలిన్ కు లేఖ రాసిన బీజేపీ ఎంపీ !
బెంగళూరు: తమిళనాడుకు విడుదల చేస్తున్న కావేరీ (cauvery) జలాల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా కావేరీ పోరాటం సాగుతోంది. కావేరీ వివాదానికి సంబంధించి రాజ్యసభ సభ్యుడు (BJP) లెహర్ సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్‌కు (stalin) లేఖ రాశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఒకరి అవసరాలను. వాళ్ల సమస్యలను ఒకరిని ఒకరు అర్థం చేసుకొవాలని మనవి చేశారు.
అందుబాటులో ఉన్న పరిమిత కావేరి (cauvery) నీటిని సమానంగా పంచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, సోదరుల్లా కలిసిమెలసి ఉండాలని బీజేపీ (BJP)ఎంపీ లెహర్ సింగ్ తమిళనాడు సీఎంస్టాలిన్ కు (stalin)మనవి చేశారు. దీనికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఒకరినొకరు నేరుగా కలుసుకుని పరిస్థితులపై చర్చించినప్పుడే ఇది సాధ్యమవుతుందని లెహర్ సింగ్ లేఖ ద్వారా తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ కు తెలిపారు.

కర్ణాటక, తమిళనాడు (Tamil Nadu) మధ్య కావేరీ (cauvery) నదీ జలాల పంపిణీ వివాదం తలెత్తిన సున్నితమైన సందర్భంలో ఈ లేఖ రాస్తున్నాను. అంతర్ రాష్ట్ర నీటి నిర్వహణ, నీటి ఒప్పందాలకు సంబంధించిన విషయాలపై నాకున్న అవగాహన పరిమితంగా ఉందని నాకు తెలుసు. అయితే నాకు ఉన్న ఆలోచనను మీతో పంచుకుంటున్నానని బీజేపీ (BJP) ఎంపీ లెహర్ సింగ్ తమిళనాడు సీఎం స్టాలిన్ కు (stalin) లేఖ రాశారు.
కర్ణాటక ఉద్దేశపూర్వకంగా నీటిని (cauvery) అడ్డుకోవడం లేదని తమిళనాడు (Tamil Nadu) గ్రహించాలని, కర్ణాటకలోని రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, మన రాష్ట్రంలోని దాదాపు 70% తాలూకాలు కరువును ఎదుర్కొంటున్నాయని, అంతేకాకుండా తాగునీటి సమస్య ప్రబలంగా ఉందని, కర్ణాటక నీటి అవసరాలు కర్ణాటకలో నివసిస్తున్న, పనిచేస్తున్న లక్షలాది తమిళ మాట్లాడేవారి నీటి అవసరాలను ఉపయోడపడుతున్నాయని తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం గుర్తించాలని బీజేపీ (BJP) ఎంపీ లెహర్ సింగ్ అన్నారు.

కావేరి నీటి విషయంలో తమిళనాడు (Tamil Nadu) అర్థం చేసుకోవాలనేది నా డిమాండ్, మేము వలస సమాజంలో జీవిస్తున్నాము. ఉపాధి కారణాల కోసం ప్రజలు తమ సొంత రాష్ట్రాలను విడిచి ఇతర రాష్ట్రాల్లో నివసించడానికి గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వలసలు పెరిగాయని, కాబట్టి మనం నీటి హక్కుల గురించి మాట్లాడేటప్పుడు సమకాలీన వలస పోకడలు మరియు (cauvery) వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని బీజేపీ (BJP) ఎంపీ లెహర్ సింగ్ తమిళనాడు సీఎం స్టాలిన్ కు (stalin) లేఖ రాశారు.












Click it and Unblock the Notifications