పెళ్లికి వెళ్లిన ఎంపీకి చెంప దెబ్బ: పక్కనే కలెక్టర్
రాజస్థాన్: రాజస్థాన్ లోని బార్మెర్ ప్రాంతంలో బీజేపీ ఎంపీకి అందరూ చూస్తుండగానే చెంప చెల్లుమనిపించాడు. ఎంపీ మీద దాడి చేసిన యువకుడు అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని వెళ్లిపోయాడు. పెళ్లి వేడుకల్లో ఎంపీతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడే ఉన్నారు.
మంగళవారం ఎంపీ సానారామ్, జిల్లా కలెక్టర్ సుధీర్ శర్మ, జిల్లా పోలీసు అధికారి పారిస్ దేశ్ ముఖ్ తదితర ప్రముఖులు ఓ వివాహానికి హాజరైనారు.ఈ సందర్బంలో పెళ్లికి ఖర్తారామ్ అనే యువకుడు వెళ్లాడు. తరువాత ఎంపీ సానారామ్ దగ్గరకు వెళ్లి ఓ విషయంపై చర్చించాడు. అక్కడే ఎంపీతో వాగ్విదానికి దిగాడు.

తరువాత ఆవేశంతో ఊగిపోయిన ఖర్తారామ్ ఎంపీ సానారామ్ ను చెంప దెబ్బ కొట్టాడు. నిందితుడు అక్కడ ఉన్న వారి కళ్లు కప్పి చాకచక్యంగా తప్పించుకుని మాయం అయ్యాడు. ఖర్తారామ్ తో పాటు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఖర్తారామ్ కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ పారిస్ దేశ్ ముఖ్ చెప్పారు. ఎంపీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఎంపీకి కొద్దిదూరంలో తాను ఉన్నానని జిల్లా కలెక్టర్ సుధీర్ శర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications