కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, సున్నితమైన ప్రాంతాల్లో బీజేపీ యాత్ర, 24 మంది హత్య !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఇప్పటికే నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్ర రాష్ట్ర పర్యటన పూర్తి చేసిన బీజేపీ ఇప్పుడు మరో యాత్రకు శ్రీకారం చుట్టడానికి సిద్దం అయ్యింది. అయితే రెండుసార్లు జరగనున్న బీజేపీ సురక్షా యాత్ర ఉత్తర కర్ణాటకలోని సున్నితమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుంది. హిందువులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రత లేదని ఆరోపించి ఆ ప్రాంతాల్లో బలంగా పుంజకోవాలని బీజేపీ పక్కా ప్లాన్ వేసింది.

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సర్వే!
  మోడీ, అమిత్ షా

  మోడీ, అమిత్ షా

  కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి ఆ పార్టీ నాయకులు సిద్దం అయ్యారు. ఇప్పుడు మరోసారి సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.

  కేరళ ప్లాన్

  కేరళ ప్లాన్

  రాజకీయ కక్షల కారణంగా కేరళలో అనేక మంది హిందూ సంఘ సంస్థల కార్యకర్తలు హత్యకు గురైనారు. ఆ సందర్బంలో బీజేపీ నాయకులు హత్యలు జరిగిన ప్రాంతాల్లో పాదయాత్రలు చేసి ప్రజలను రెండు వర్గాలుగా చీల్చేశారు. బీజేపీ పాదయాత్రకు కేరళలలో మంచి మద్దతు వచ్చింది.

  సురక్షా యాత్ర

  సురక్షా యాత్ర

  కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ నాయకులు నవ కర్ణాటక నిర్మాణ యాత్ర పూర్తి చేశారు. మార్చి 3, మార్చి 6వ తేదీల్లో ఉత్తర కన్నడ జిల్లాల్లో పాదయాత్రలు చెయ్యడానికి బీజేపీ సిద్దం అయ్యింది. బీజేపీ చేపట్టిన పాదయాత్ర ప్రాంతాలు చాల సున్నితమైనవి.

  24 మంది హత్య

  24 మంది హత్య

  కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీతో సహ అనేక హిందూ సంఘ సంస్థలకు చెందిన 24 మంది కార్యకర్తలు దారుణ హత్యకు గురైనారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పాదయాత్ర చేసి కులాలకు అతీతంగా హిందువుల అందర్నీ ఏకం చెయ్యాలని బీజేపీ ప్లాన్ వేసింది.

  పాదయాత్ర ప్రాంతాలు

  పాదయాత్ర ప్రాంతాలు

  మార్చి 3వ తేదీ ప్రారంభం అయ్యే బీజేపీ సురక్షా యాత్ర కుశాలనగర్, మడికేరి, సుళ్యా, పుత్తూరు, కళ్లడక్, బంట్వాళ, మంగళూరు, సూరత్కల్ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. మార్చి 6వ తేదీ సూరత్కల్ నుంచి ప్రారంభం అయ్యే సురక్షా యాత్ర సందర్బంగా హత్యకు గురైన భజరంగదళ్ కార్యకర్త దీపక్ రావ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

   సున్నితమైన ప్రాంతాలు

  సున్నితమైన ప్రాంతాలు

  రెండు విడతలో బీజేపీ సురక్షా యాత్ర అంకోల, కుమట, హోన్నావర్, బత్కల్, బైందూరు, కుందాపుర, ఉడిపి, కాపు, ముల్కి మీదుగా సూరత్కల్ చేరుకుంటుంది. బీజేపీ చేపట్టిన సురక్షా యాత్ర మొత్తం సున్నితమైన ప్రాంతాలు కావడం కొసమెరుపు. కులాలకు అతీతంగా హిందువులను ఏకతాటిపైకి తీసుకురావాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP has decided to launch a yatra in communally sensitive parts of the state. Divided into two groups, BJP leaders will undertake a padayatra Karnataka Suraksha Yatra from Kushalnagara and Ankola simultaneously.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి