మణిపూర్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం: రేపు సీఎంగా బీరెన్ ప్రమాణం
మణిపూర్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇంపాల్: మణిపూర్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తదితరులు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.
60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్‌లో మేజిక్ ఫిగర్ 31. కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది.

దీంతో చిన్న పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నలుగురు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు, ఎల్‌జీపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చొప్పున బీజేపీకి మద్దతిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 32 మంది సభ్యులుగా ఉన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా బీజేపీని ఆహ్వానించారు. దీంతో తొలిసారిగా మణిపూర్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్ బిరెన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications