• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేఘాలయ మిషన్: క్రైస్తవ అనుకూలత కోసం ‘కమలం’ ఆపసోపాలు

By Swetha Basvababu
|

షిల్లాంగ్: మేఘాలయలో పార్టీ అధికారానికి చేరువయ్యేందుకు హిందుత్వ నినాదం ప్లస్ క్రైస్తవ వ్యతిరేత అడ్డంకిగా ఉన్నదని బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నారు. ఈ ముద్ర తొలిగించేందుకు ఉగ్రవాదుల నుంచి వెస్ట్ ఆసియాలో మిషనరీల్లో పని చేస్తున్న నర్సులను రక్షించడానికి ప్రధాని నరేంద్రమోదీ చర్యలు చేపట్టారు.

బీజేపీ అంటే విభజన ఎజెండాతో పని చేసే అతివాద హిందూ పార్టీ అన్న ముద్ర తొలగించుకునేందుకు కమలనాథులు అష్టకష్టాల పాలు అవుతున్నారు. గతేడాది 'బీఫ్' వివాదం ముందుకొవచ్చినప్పుడు ఉత్తర భారతంపై మిషనరీలు, చర్చిలపై దాడులతో బీజేపీ పట్ల ప్రతికూల వాతావరణం నెలకొని ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకునే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు ప్రారంభించింది.

మేఘాలయ రాష్ట్రంలో 75 శాతం జనాభా క్రైస్తవులే

మేఘాలయ రాష్ట్రంలో 75 శాతం జనాభా క్రైస్తవులే

ఒకవేళ మేఘాలయలో బీజేపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులపై ‘హిందుత్వ'ను బలవంతంగా రుద్దుతారని హోరెత్తించింది. మేఘాలయ జనాభాలో 75 శాతం మంది జనాభా క్రైస్తవులు మాత్రమే కాదు. అత్యధికులు బీఫ్ తింటారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఫ్ తినే వారు దేశ వ్యతిరేకులు, దేశం నుంచి వెళ్లిపోవాలని సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలన్నీ హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో గ్యారీ హిల్స్ చర్చి 150వ వార్షికోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు జొహెన్స్‌బర్గ్ కేంద్రంగా పని చేస్తున్న ప్రపంచ బాప్తిస్టు కూటమి అధ్యక్షుడు నావెల్డా పాల్ మిజాకు వీసా నిరాకరించడాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపైనా, బీజేపీపైనా కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి సాగిస్తూ వచ్చింది.

క్రైస్తవుల సంప్రదాయాలకు, కల్చర్‌కు బీజేపీ వ్యతిరేకం

క్రైస్తవుల సంప్రదాయాలకు, కల్చర్‌కు బీజేపీ వ్యతిరేకం

క్రైస్తవుల పట్ల బీజేపీకి ఎటువంటి ఆసక్తి లేదని మేఘాలయ సీఎం ముకుల్ ఎం సంగ్మా అని పేర్కొన్నారు. క్రైస్తవుల సంప్రదాయాలు, సంస్క్రుతికి వ్యతిరేకంగా, ఆహారపు అలవాట్లకు వ్యతిరేకమని గ్యారో హిల్స్‌లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు క్రైస్తవులకు వ్యతిరేకంగా పురాణాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారు.

క్రైస్తవులు ఆందోళన చెందాల్సిందేమీ లేదని బీజేపీ ప్రచారం

క్రైస్తవులు ఆందోళన చెందాల్సిందేమీ లేదని బీజేపీ ప్రచారం

దక్షిణ తుర నుంచి బీజేపీ అభ్యర్థిగా బిల్లీకిడ్ ఏ సంగ్మా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రచారంలో ‘బీజేపీ ఒక రాజకీయ పార్టీ. మతం కాదు. ఇది ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. ఈ అంశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు' అని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్రైస్తవుల అనుకూల విధానంపై ఫోకస్ పెట్టారని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. వెస్ట్ ఆసియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బందీ నుంచి క్రైస్తవ మిషనరీలను విడిపించడానికి చర్యలు తీసుకున్నారు. వారిలో పలువురు మేఘాలయలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

మేఘాలయలో ఆర్థిక పునర్జీవనంపైనే అందరి ద్రుష్టి

మేఘాలయలో ఆర్థిక పునర్జీవనంపైనే అందరి ద్రుష్టి

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు, క్రైస్తవులు బీఫ్‌పై నిషేధం తదితర అంశాలపై తీవ్రస్థాయిలో ఆందోళనకు గురవుతున్నారు. మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించడంతో రాష్ట్రానికి ఆర్థిక పునర్జీవనం కలిగించే అంశాలపై అంతా ద్రుష్టి సారించారని మేఘాలయ బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త హాకా లింగ్డో తెలిపారు. అయితే విదేశాల్లో ఉగ్రవాద దాడుల్లో చిక్కుకున్న మిషనరీలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు బీజేపీపై గల క్రైస్తవ వ్యతిరేక ముద్ర తొలిగిపోయేందుకు సాయ పడిందని హాకా లింగ్డో చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ తన ఎన్నికల ప్రచారంలో వెస్ట్ ఆసియాలో మిషనరీలను రక్షించిన అంశాలపైనే ఎక్కువగా ప్రచారం చేశారు.

మేఘాలయలో గెలుపుపై రిజిజు ఆశాభావం

మేఘాలయలో గెలుపుపై రిజిజు ఆశాభావం

త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు విశ్వాసం వ్యక్తం చేశారు. మేఘాలయలో విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. మేఘాలయలో విధాన నిర్ణాయక శక్తిగా మారుతామన్నారు. నాగాలాండ్ లో 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. దాని మిత్ర పక్షం ‘ఎన్డీపీపీ' మిగతా స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఇంతకుముందు అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో పలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించామని తెలిపారు. ఈశాన్య భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ పరిష్కార మార్గం చూపుతుందని కిరెన్ రిజిజు అన్నారు.

ఈశాన్య బారతంలోనూ పట్టు సాధిస్తామన్న కేంద్ర మంత్రి

ఈశాన్య బారతంలోనూ పట్టు సాధిస్తామన్న కేంద్ర మంత్రి

క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం త్రిపురలో పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. నాగాలాండ్‌లోనూ ఎన్డీపీపీతో కలిసి కూటమిగా పోటీ చేసి అవసరమైన మెజారిటీ సాధించి సర్కార్ ఏర్పాటు చేస్తామన్నారు. మేఘాలయలో సానుకూల ఫలితాలను సాధిస్తామని అన్నారు. మేఘాలయలో 10 ఏళ్లకు పైగా పార్టీ ఇన్ చార్జీగా తాను పని చేస్తున్నానని గుర్తు చేసిన కిరెన్ రిజిజు.. ఈ దఫా పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ మైనారిటీల్లో భయాందోళనలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నదని కిరెన్ రిజిజు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi appears to have given the Bharatiya Janata Party in Meghalaya an idea for shaking off the anti-Christian tag — the rescue of missionaries from terrorists in West Asia. Labelled by the Congress as a “hardcore Hindu party” with a divisive agenda, the BJP had been struggling to dovetail its Hindutva image with a pro-minority face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more