బీజేపీ ప్రత్యేక శైలి: బీహార్ మార్కెట్‌లో మోడీ చీరలు
పాట్నా: ఈ ఏడాది చివరకు బీహార్ అసెంబ్లీ స్ధానానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో బీహార్‌లోని పార్టీలన్నీ ఓటర్లకు వల వేసేందుకు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. ఇటీవల బీహార్‌లో జరిగిన స్ధానిక ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీహార్ బీజేపీ శాఖ నితీశ్ కుమార్‌ను గద్దెదింపి బీహార్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది.

ఈ క్రమంలో బీజేపీ మోడీ చీరల కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థానిక నేతలు విశ్రప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓట్లను సొంతం చేసుకునే దిశగా చీరల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
సూరత్‌కు చెందిన 25 మంది తయారీదారులచే ప్రత్యేకంగా తయారు చేయించిన చీరల ప్యాకెట్లను బీజేపీ ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మొత్తం 10 లక్షల చీరల ప్యాకెట్లు అందించాలని నిర్ణయించినట్లు బీజేపీ వర్గాల సమాచారం.
ఒక్కో ప్యాకెట్‌పై మోడీ బొమ్మ, బీజేపీ స్లోగన్ ఉంది. ఈ చీరల పంపిణీ కార్యక్రమం అంతా ఓ బీజేపీ ఎంపీ పర్యవేక్షిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Saris sold by a Surat(Gujarat) trader packed for Bihar in bags with PM Modi's picture on them ahead of assembly polls pic.twitter.com/LzWyvxBFzq
— ANI (@ANI_news) July 15, 2015 











Click it and Unblock the Notifications