వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో మళ్ళీ బీజేపీదే హవా.. మరో ప్రీపోల్స్ సర్వే ఫలితాలిలా!!

|
Google Oneindia TeluguNews

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం మాత్రమే గడువు ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందే జరుగుతున్న, అనేక రాష్ట్రాలు ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి.

సార్వత్రిక ఎన్నికల ముందు కీలకంగా మారిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల ముందు కీలకంగా మారిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు


ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ విజయం సాధించి, తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఓటరు నాడిని స్పష్టం చేస్తాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి గుజరాత్ లో రెండు విడతలుగా, హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

 బీజేపీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో మరోమారు బీజేపీదే పైచెయ్యి.. వెల్లడించిన సర్వే

బీజేపీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో మరోమారు బీజేపీదే పైచెయ్యి.. వెల్లడించిన సర్వే

ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రీ పోల్స్ సర్వేలు జోరందుకున్నాయి. ఇక ఈ సర్వేలలో దాదాపు ఎక్కువశాతం సర్వేలు బిజెపి వైపు మొగ్గు చూపుతుండటం గమనార్హం. తాజాగా రిపబ్లిక్ టీవీ పి మార్క్యు పోల్ వెల్లడించిన సర్వేలో గుజరాత్లో బీజేపీ మూడింట రెండు వంతుల విజయాన్ని అంచనావేసింది. మొత్తం 182 స్థానాలలో 127 నుండి 140 వరకు బిజెపికి వస్తాయని పేర్కొంది. 46.2 ఓటు శాతం బిజెపికి వస్తుందని అంచనా వేసింది.

రిపబ్లిక్ టీవీ పి మార్క్యు పోల్ సర్వే ఫలితాలు ఇలా

రిపబ్లిక్ టీవీ పి మార్క్యు పోల్ సర్వే ఫలితాలు ఇలా

కాంగ్రెస్ 28.4 శాతం ఓట్లతో 35 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 20.6 శాతం ఓట్లతో 9 నుంచి 21 సీట్లు గెలుచుకో గలదని అంచనా వేసింది. ఇప్పటివరకు వెల్లడించిన ఇతర సర్వేలు ఇతరులు రెండు స్థానాలను సాధించే అవకాశం ఉందని అంచనా వేయగా అందుకు భిన్నంగా మూడు స్థానాల వరకు ఇతరులకు వస్తాయని అంచనావేసింది.

హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ దే హవా..తేల్చేసిన ప్రీ పోల్ సర్వే

హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ దే హవా..తేల్చేసిన ప్రీ పోల్ సర్వే

అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఉందని తన సర్వే ఫలితాలను వెల్లడించింది. 68 మంది సభ్యులు అసెంబ్లీలో బీజేపీకి 37 నుండి 45 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం బిజెపి 45.2 శాతం ఓట్ల శాతం తో ఫస్ట్ ప్లేస్ లో ఉండనుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 22 నుండి 28 సీట్లతో 40.1 ఓటింగ్ శాతం తో 2017 పనితీరుతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అంచనావేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందని, 5.2 శాతం ఓట్ షేర్ ఉంటుందని పేర్కొంది. ఇక ఇతరులకు ఒకటి నుంచి నాలుగు సీట్లు రావచ్చని అంచనావేసింది.

English summary
BJP will win in gujarat and himachal pradesh, Republic TV-P-MARQ poll prediction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X