Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (tamil nadu assembly election 2026) ఈసారి ఎలాగైనా సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న జాతీయ పార్టీ బీజేపీ (bjp) ఇవాళ తమ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. 27మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి.. ముఖ్యంగా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఇప్పటికే పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న అన్నామలైకి పుండు మీద కారం చల్లినట్లయింది.

తమిళనాడులో బీజేపీకి కీలక నాయకుడైన కె. అన్నామలై.. ఈసారి బీజేపీ ప్రచారానికి ముఖచిత్రంగా ఉంటారని భావించినా.. ఆయనకు ప్రస్తుతం విడుదల చేసిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గానికి అన్నామలై బీజేపీ అభ్యర్థిగా ఉంటారని భావించినా..పార్టీ ఆ స్థానానికి వానతి శ్రీనివాసన్‌ను తిరిగి నిలబెట్టడం పార్టీలోని అంతర్గత కలహాలకు సంకేతంగా నిలుస్తోంది. మరో సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

BJP s First Tamil Nadu List Out Tamilisai Vanathi In Annamalai Missing from 27 Candidates

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అరంతంగి నుంచి కవిత శ్రీకాంత్, విలవన్కోడ్ నుంచి విజయ ధరణి, మొదక్కురిచ్చి నుంచి క్రితికా శివకుమార్ కు చోటు దక్కింది. వీరితో పాటు ఇతర అభ్యర్ధులతో కూడిన జాబితాను అన్నామలై ట్వీట్ చేస్తూ సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన బీజేపీ విజేత అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు అన్నారు.అవినీతి, నిర్లక్ష్యం, డీఎంకే ద్రోహంతో విసిగిపోయిన తమిళనాడులోని ప్రతి సోదర సోదరీమణుల మద్దతు వారికి ఉందన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే 210 సీట్లు గెలవాలనే లక్ష్యంతో, ఒక కార్యకర్తగా తాను బీజేపీతో పాటు ఇతర ఎన్డీయే పార్టీల అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+