వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ ‘బ్లాక్ బెల్ట్’: ఐకిడో స్టిల్స్ అదుర్స్(పిక్చర్స్)

తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫొటోలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలోని కొత్త కోణాన్ని చూపించాయి. రాహుల్‌..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi Aikido Black Belt Photos Goes Viral | Oneindia Telugu

న్యూఢిల్లీ: తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫొటోలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలోని కొత్త కోణాన్ని చూపించాయి. రాహుల్‌.. కోచ్‌తో కలిసి ఐకిడో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

రాహుల్ గాంధీ బ్లాక్ బెల్ట్..

రాహుల్ గాంధీ బ్లాక్ బెల్ట్..

కాగా, ఇటీవల రాహుల్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా.. నేను ఐకిడోలో బ్లాక్‌బెల్ట్‌. కానీ దీని గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ మాట్లాడలేదు. రోజూ గంట పాటు స్పోర్ట్స్‌ ఆడతా. కానీ నాలుగు నెలలు నుంచి ఎలాంటి క్రీడలూ ఆడటంలేదు.' అని వ్యాఖ్యానించడం వైరల్‌‌గా మారింది.

విజేందర్ కౌంటర్..

విజేందర్ కౌంటర్..

అయితే, రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌..‘నిజమా? అయితేప్రజలు మీ నుంచి స్ఫూర్తి పొందేలా క్రీడలు ఆడుతున్న వీడియోను పోస్ట్‌ చేయొచ్చుగా..' అని అన్నారు.

ఐకిడో ప్రాక్టీస్ చేస్తూ రాహుల్..

ఐకిడో ప్రాక్టీస్ చేస్తూ రాహుల్..

విజేందర్ చెప్పిన దానికి రాహుల్‌ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు రాహుల్‌ ఐకిడో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో దర్శనమివ్వడం గమనార్హం. కాగా, రాహుల్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులతోపాటు విచిత్రమైన కామెంట్లు కూడా వస్తున్నాయి.

కామెంట్లు మాత్రం మామూలుగా లేవు..

రాహుల్‌ ఐకిడో ఫొటోలపై వచ్చిన కొన్ని కామెంట్లను పరిశీలించినట్లయితే.. ‘నాకు తెలిసి రాహుల్‌కి చోటా భీమ్‌ ఐకిడో నేర్పించి ఉంటాడు', ‘రాహుల్‌ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయాలి' , ‘రానున్న ఎన్నికల్లో పోరాడటానికి రాహుల్‌ ఇప్పటినుంచే ప్రాక్టీస్‌ చేస్తున్నాడా?', ‘అంటే ఇప్పుడు మీ కుక్క పిడి కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటుందా?', ‘నకిలీ హార్వర్డ్‌ డిగ్రీ ఉన్నట్టే నకిలీ బ్లాక్‌బెల్ట్‌ తెచ్చుకున్నాడా?', ‘ఎన్ని ప్రాక్టీసులు చేసినా.. రాహుల్.. బీజేపీ, మోడీని ఓడించలేరు' అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

English summary
Congress vice-president Rahul Gandhi recently divulged that he is a sports aficionado - he runs, swims, gyms and also holds a black belt in Japanese martial art Aikido.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X